బెంగుళూరు సెంట్రల్‌ లో ప్రకాశ్‌రాజ్‌ నామినేషన్‌

Share Icons:

బెంగళూరు, మార్చి22,

బెంగళూరు సెంట్రల్‌ పార్లమెంటు స్థానానికి ప్రముఖ బహు బాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌ నామినేషన్‌ వేశారు. ప్రకాశ్‌ రాజ్‌ స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. గతంలోనే ప్రకాశ్‌రాజ్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్ధిగి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, మార్చి 12వ తేదీన బెంగుళూరులో మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజకీయ ప్రసంగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రసంగాన్ని ఒకరు రికార్డు చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌పై కబ్బన్‌ పార్కు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

రాజకీయాలలో పారదర్శకత, నిజాయితీ, సేవా భావాలు పెంపొందించడానికి, ప్రజలు సామరస్యంగా, ప్రశాంతంగా జీవించడానికి కృషి చేస్తానని ప్రకాష్ రాజ్ తెలిపారు.

మామాట: సినిమారంగం వయా రాజకీయాలుగా మారింది కాలం…

Leave a Reply