బండ్ల మళ్ళీ వచ్చారు: పవన్ పై పొగడ్తల వర్షం…

bandla ganesh come back again in media and praises pawan kalyan
Share Icons:

హైదరాబాద్: గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి సినీ నిర్మాత బండ్ల గణేశ్ హడావిడి చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే సెవన్ ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటా అని సంచలనం సృష్టించిన బండ్ల గణేష్ ఆ తరువాత రాజకీయ పరిణామాలతో రాజకీయాలు తన ఒంటికి సరిపడవని బయటకు వెళ్లిపోయారు. అయితే చాలాకాలం పాటు మీడియాకు దూరంగా ఉన్న బండ్ల తాజాగా….ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన కోరిక అని, ఏదో ఒకరోజు తప్పక ఆ కోరిక తీరుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఆవేశం రాష్ట్ర ప్రజల మంచి కోసమేనని, ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే అది ఏపీ ప్రజల అదృష్టమని బండ్ల గణేష్ తెలిపారు. ముఖ్యమంత్రికి కావలసిన అన్ని అర్హతలు పవన్ కళ్యాణ్ కు ఉన్నాయని, పవన్ కు తనకు మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని పేర్కొన్నారు. శరీరాలు వేరైనా తమ మనసులు ఒకటేనని చెప్పుకున్నారు.

కాగా, పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడిని అని చెప్పుకునే బండ్ల గణేష్ గత ఎన్నికల సమయంలో ఊహించని విధంగా కాంగ్రెస్ లో చేరి సంచలనాలతో రాష్ట్రం దృష్టిని ఆకర్షించాడు. కానీ కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడంతో..రాజకీయాల్లో ఉన్నది , ఉంచుకున్నదీ పోయిందని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇది టెంపరరీగా కాదు.. పాలిటిక్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశాను అంతేనని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు .మంచి సినిమా.. కాస్త మనకు డబ్బులు మిగులుతాయని అనుకుంటే తీస్తానని చెప్పారు. డబ్బులు మిగలకుండా సినిమా తీయాలంటే తనకు భయమని చెప్పిన ఆయన రాజకీయాలకు గుడ్ బై అన్నారు. ఇప్పుడు బండ్ల మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. మరి బండ్ల సినిమాల్లో సత్తా చాటుతారేమో చూడాలి.

Leave a Reply