బాలయ్యకు షాక్ !

Share Icons:

హిందూపురం, ఏప్రిల్ 05,

అనంత‌పురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా గ‌త ఎన్నిక‌ల్లో గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లోనూ అదే నియోజ‌క వ‌ర్గం నుంచి మ‌రోసారి పోటీకి దిగారు. ఇందులో భాగంగా హిందూపురంలో ప్ర‌చారానికి వెళ్లిన బాల‌య్య‌కు అక్క‌డి మ‌హిళ‌లు ఖాలీ బిందెల‌తో నిర‌స‌న తెలిపి చుక్క‌లు చూపించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌త కొంత కాలంగా నీటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న హిందూపురం మ‌హిళ‌లు ఎన్నిసార్లు ఆ విష‌యాన్ని బాల‌కృష్ణ వ‌ద్ద ప్ర‌స్తావించినా ప‌ట్టించుకోలేదు. సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ప్ర‌చారానికి వ‌చ్చిన బాల‌కృష్ణ‌ను అక్క‌డి మ‌హిళ‌లు ఖాలీ బిందెల‌తో ఎదెరెళ్లి అడ్డుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. దేమ‌కేతెప‌ల్లిలో భారీ స్థాయిలో గుమిగూడిన మ‌హిళ‌లు బాల‌య్య‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేసి ప్ర‌చారాన్ని అడ్డుకున్నారు.

తాగునీటి స‌మ‌స్య‌ను తీర్చ‌కుండా మ‌ళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడ‌గ‌టానికి వ‌చ్చార‌ని ఎస్సీకాల‌నీకి చెందిన మ‌హిళ‌లు నిల‌దీయ‌డంతో బాల‌కృష్ణ అవాక్కయ్యారు.. త‌రువాత తేరుకుని నియోజ‌క వ‌ర్గ స‌మ‌స్య‌ల్ని త‌న వ‌ద్ద‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకురావాల‌ని స్థానిక నాయ‌కుల‌కు ఆదేశించిన బాల‌య్య అక్క‌డి నుంచి  వెళ్లిపోయారు.

 

మామాట: తొడగొడితే నీళ్లు రావా,  బావా…

Leave a Reply