బాలయ్యకి రూమ్ సెంటిమెంట్..ఫలితాల రోజు అక్కడే బస…

Share Icons:

హిందూపురం, 22 మే:

హీరోనందమూరి బాలకృష్ణ….2014లో తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. తెలుగుదేశం అభ్యర్ధిగా హిందూపురంలో పోటీ చేసి సుమారు 16 వేల ఓట్ల పైనే మెజారిటీతో వైసీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఈ సారి జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన హిందూపురం నుంచే పోటీ చేశారు.

అయితే 2014లో ఓట్ల లెక్కింపు సమయంలో  అనంతపురం ఎస్కే యూనివర్సిటీ ఆర్టీటీ స్టేడియంలోని 9వ నంబర్ గదిలో బాలకృష్ణ బస చేసి, కౌంటింగ్ సరళిని పరిశీలించారు. ఇక ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం జరిగింది.

దీంతో ఈ ఎన్నికల్లో కూడా అదే గదిలో ఉండి ఎన్నికల సరళిని పరిశీలించాలని అనుకుంటున్నారు. అందులోనే బస చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే ఆ గదిని మరొకరికి కేటాయించిన అధికారులు, బాలయ్య కోరిక మేరకు దాన్ని ఖాళీ చేయించారు. ఈ సాయంత్రం నుంచి బాలయ్య ఇదే గదిలో బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మామాట: మరి బాలయ్య సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో

Leave a Reply