క్లిష్ట సమయంలో అబ్బాయ్‌లకు బాసటగా బాబాయ్(వీడియో)…

Balakrishna talk with ntr and kalyan ram viral video
Share Icons:

హైదరాబాద్, 31 ఆగష్టు:

చాలాకాలం నుండి నందమూరి కుటుంబంలో నెలకొన్న విభేదాలు హరికృష్ణ మరణంతో తొలిగిపోయినట్లు కనిపిస్తోంది. కుటుంబసభ్యులందరూ ఒకరికి మరొకరు తోడున్నామన్నంతగా ఏకమైపోయారు. ముఖ్యంగా బాలకృష్ణ, ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న దూరం తగ్గినట్లు తెలుస్తోంది.

అందుకు నిదర్శనంగా ఈరోజు మధ్యాహం హరికృష్ణ నివాసం వద్ద పలువురు ప్రముఖులు భోజనాలు చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భోజనాలు చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ రామ్‌ల వద్దకు వెళ్లిన బాలయ్య… వారిద్దరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇక బాలయ్య మాట్లాడుతుంటే తారక్ ఎంతో వినయంగా వింటుండటం ఆకట్టుకుంటోంది. నందమూరి కుటుంబసభ్యులు ఆప్యాయంగా మాట్లాడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అలాగే హరికృష్ణ తనువు చాలించిన దగ్గర నుండి నిన్న అంత్యక్రియలు ముగిసే వరకు బాలకృష్ణ, సీఎం చంద్రబాబులు అన్నీ పనులు దగ్గర ఉండి చూసుకున్నారు. ఇక హరికృష్ణ భౌతికకాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు భుజాన మోయడం అందరికీ సంతోషం కలిగేలా చేసింది.

ఇక ఒకవైపు హరికృష్ణ మరణం…మరో వైపు అందరూ సమిష్టిగా కలిసి ఉన్న ఈ దృశ్యాలని చూసిన నందమూరి అభిమానులు క్లిష్ట సమయంలో కుటుంబం ఒక్కటైంది అని అనుకుంటూ తమ బాధని, ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

మామాట: ఎంతైనా రక్తసంబంధం కదా…!

Leave a Reply