బాలయ్య వారసుడు ఎంట్రీ ఇప్పటిలో కష్టమే….!

balakrishna son mokshagna entry in movies
Share Icons:

హైదరాబాద్: నందమూరి తారకరామరావు కుటుంబం నుంచి చాలమంది హీరోలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడుగా నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి అగ్రనటుడుగా ఎదిగాడు. ఎన్టీఆర్ తర్వాత సినిమా రంగంలో నందమూరి ఫ్యామిలీ నిలబడిదంటే దానికి కారణం బాలయ్యనే. ఇక బాలయ్య తర్వాత మరికొందరు హీరోలు వచ్చిన….జూనియర్ ఎన్టీఆర్ లాగా ఎవరు పెద్దగా నిలబడలేదు. జూనియర్ ఇప్పుడు టాప్ యాక్టర్ గా ఉన్నాడు.

అయితే చాలా సంవత్సరాలు నుంచి నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అయితే నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే 23 ఏట అడుగు పెట్టాడు మోక్షు. దాంతో ఇప్పుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ఇప్పుడు నంద‌మూరి అభిమానులు బాల‌య్య‌ను ప్ర‌శ్నిస్తున్నారు. పైగా ఆయనకు సినిమాలంటే ఆసక్తి లేదని.. బిజినెస్ వైపు అడుగేస్తున్నాడంటూ ఈ మధ్య కొన్ని వార్తలు కూడా వచ్చాయి. దాంతో బాలయ్య ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దీనికి స‌మాధానంగా బాల‌య్య కూడా ఇప్పుడు అభిమానులకు సమాధానమిచ్చినట్లు తెలుస్తుంది. తన వారసుడు ప్రస్తుతం చదువులతో బిజీగా ఉన్నాడని.. అది పూర్తైన తర్వాత సినిమాలు చేస్తాడని క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కచ్చితంగా నటనలోకి వస్తాడని.. బిజినెస్ లాంటివి ఏముండవంటూ అభిమానులకు బాలయ్య మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే బాలయ్య చెప్పినట్లు మాత్రం అక్కడేమీ జరగట్లేదు. మోక్షు ప్రస్తుతం ఓవర్ వెయిట్‌తో ఉన్నాడు. ఈ మధ్య విడుదలైన ఫోటోలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. దాంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.. అసలు ఈయనకు నటనంటే ఆసక్తి ఉందా లేదా అంటూ అనుమానపడుతున్నారు కూడా. కానీ బాలయ్య మాత్రం అలాంటి అనుమానాలేవీ పెట్టుకోవద్దంటూ భరోసా ఇస్తున్నాడు. కచ్చితంగా వస్తాడు కానీ ఇప్పట్లో మాత్రం కాదని క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం కే‌ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది.

 

Leave a Reply