సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న బాలయ్య…?

Share Icons:

హైదరాబాద్: పాత్రలకి ప్రాణం పోస్తూ నటించే హీరోలకి మన తెలుగు సినిమా ఇండస్ట్రిలో కొదవే లేదు. కొందరు హీరోలైతే ప్రతి పాత్రకి వైవిధ్యమైన నటన కనబరుస్తూ పాత్రలో ఇమిడిపోయి జీవిస్తారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా పాత్రకి జీవం పొయ్యడం మాత్రమే తెలిసిన బాలయ్య తన కెరీర్‌లో ఇప్పటి వరకూ 104 చిత్రాలు చేశారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న 105వ చిత్రం తాజాగా 3వ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య ఒక పవర్‌ఫుల్ డాన్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అందుకే ఈ సినిమాకి ‘రూలర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ .. వేదిక నటిస్తున్నారు. డిఫరెంట్ గెటప్ లో బాలకృష్ణ ఈ సినిమాలో కనిపించనున్నారు. మొదటి నుంచి బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. సంక్రాంతికి తన సినిమా తప్పకుండా బరిలో ఉండాలని ఆయన భావిస్తారు.

అందువలన ఈ సారి కూడా సంక్రాంతికి ఆయన సినిమా ఉంటుందని అభిమానులు ఆశించారు. అయితే ఈ సంక్రాంతికి గట్టిపోటీ వుంది.  సంక్రాంతి బరిలో మహేశ్ బాబు ‘సరిలేరు నీ కెవ్వరు’ .. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతికి బరిలోకి దిగనున్నాయి. ఇక రజనీ ‘దర్బార్’ కూడా రంగంలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3వ వారంలో ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని బాలకృష్ణ భావించినట్టుగా సమాచారం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఆదిత్య అరుణాచలంగా రజనీ…

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, అంతా ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రజనీ ‘ఆదిత్య అరుణాచలం’ అనే పాత్రలో కనిపించనున్నట్టు నివేద థామస్ చేసిన ఒక ట్వీట్ వలన తెలుస్తోంది.

నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, రజనీ కూతురు పాత్రలో నివేద థామస్ కనిపించనుంది. ‘ఒకే ఒక్కడి గురించి ఈ ప్రపంచం తెలుసుకోవలసిన సమయం  వచ్చింది .. ఆయనే మా నాన్న .. ఆదిత్య అరుణాచలం’ అంటూ ‘దర్బార్ ‘ సినిమాలో రజనీ పాత్ర పేరును రివీల్ చేసింది. మురుగదాస్ దర్శకత్వంలో రజనీ చేస్తున్న ఈ సినిమా, ఆయన కెరియర్లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

 

Leave a Reply