బాలయ్య కూడా పోలింగ్ లెక్కలు తేల్చుకునే పనిలో పడ్డారుగా….

Share Icons:

అనంతపురం, 26 ఏప్రిల్:

ఎన్నికలు ముగిశాక ఈ నెల 22న అమరావతిలో ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ అభ్యర్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయా నియోజక వర్గాల్లో పోలింగ్‌ సరళిపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే మే మొదటివారంలో మరోసై జరిగే సమావేశంలో అభ్యర్ధులంతా పక్కా లెక్కలతో రావాలని చంద్రబాబు చెప్పారు. ఈనేపథ్యంలో బాలకృష్ణ హిందూపురంలో లెక్కలని తెల్చేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి  రెండు రోజులపాటు మండలాల వారిగా మండల, పట్టణ కన్వీనర్లు, గ్రామీణ పార్టీ, బూత్‌ కమిటి సభ్యులతోపాటు నాయకులతో పోలింగ్‌ సరళిపై సమీక్ష చేపట్టనున్నారు.

నియోజక వర్గంలోని 2,29,262 ఓటర్లకుగాను 1,77,903 ఓట్లు పోలింగు కాగా 77.60 శాతం పోలింగ్‌ శాతం నమోదయ్యింది. నియోజకవర్గంలో 256 పోలింగ్‌ స్టేషన్లలో ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఎన్నిఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఏపార్టీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ముందో అంచనాలు, ఎన్నికల్లో నాయకులు పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు పని చేశారో, ఎవరు పనిచేయలేదో, కుల, వర్గ, సమీకరణలతో తెలిపే నివేదికతో రావాలని లోకల్  నాయకులకు బాలయ్య సూచించినట్లు తెలుస్తోంది. మరి హిందూపురంలో బాలయ్య లెక్కలు ఏం చెబుతాయో చూడాలి.

మామాట: లెక్కల తిప్పలు బాలయ్యకి కూడా తప్పలేదనమాట

Leave a Reply