స్నేహితుడుని బుజ్జగిస్తున్న బాలయ్య…

Share Icons:

ప్రకాశం, 19 మార్చి:

ఈ సారి ఎన్నికల్లో టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల అభ్యర్ధులని అటు ఇటు మార్చేశారు. ఈ క్రమంలోనే తన సిట్టింగ్ సీటు కాకుండా వేరే అసెంబ్లీ సీటు కేటాయించారని టీడీపీ నాయకత్వంపై బాలయ్య స్నేహితుడు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆగ్రహంగా ఉన్నారు.

కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కదిరి బాబూరావుకు ఈ సారి దర్శి నుంచి సీటు కేటాయించారు. కనిగిరి నుంచి ఇటీవల టీడీపీలో చేరిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి అవకాశం కల్పించారు. దీనిపై కదిరి బాబూరావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కనిగిరి సీటు మళ్లీ తనకే ఇవ్వాలని బాబూరావు టీడీపీకి గతంలోనే స్పష్టం చేశారు. పైగా బాబూరావు… ఈ విషయంలో బాలయ్య ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో తాను అనుకున్నది చేశారు. 

దీంతో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కనిగిరి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని కదిరి బాబూరావు భావిస్తున్నట్టు సమాచారం. ఈ అంశంపై ఆయన అనుచరులతో సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కదిరి బాబూరావును బుజ్జగించేందుకు బాలకృష్ణ కుటుంబసభ్యులు రంగంలోకి దిగారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి బాలయ్య బుజ్జగింపులతో కదిరి మెత్తబడతారా లేదా అన్నది చూడాలి. 

మామాట: అనుకున్నది జరగపోతే అలక మామూలే

Leave a Reply