కన్నడ సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్…!

Share Icons:

బెంగళూరు, 14 జనవరి:

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరో 125వ సినిమాగా… ‘భైరతి రణగళ్’ తెరకెక్కుతుంది. శ్రీ ముత్తు సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకి నార్తన్ దర్శకనిర్మాతగా వ్యవహరించనున్నాడు.

అయితే నెంబర్ పరంగా శివరాజ్‌కి ఈ సినిమా ప్రత్యేకం కావడంతో.. ఈ సినిమాలోని ఒక కీలకమైన అతిథిపాత్రని  చేయవలసిందిగా ఆయన బాలయ్యను రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. శివరాజ్ కుమార్ .. బాలకృష్ణ ఇద్దరు మంచి స్నేహితులు. అందువల్లనే గతంలో బాలకృష్ణ అడగ్గగానే ఆయన ‘గౌతమీపుత్ర శాతకర్ణి ‘సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. అది బాలయ్యకి 100వ సినిమా. అలాగే ఇప్పుడు ‘125  సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నారన్న మాట. అయితే బాలయ్య ఈ సినిమాకి ఒకే చెప్పరో లేదో తెలియాల్సి ఉంది.

మామాట: ఈ సినిమా సెట్ అయితే బాలయ్య కన్నడలో కూడా కనపడనున్నాడు అన్నమాట…

Leave a Reply