ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్ డల్…బాలయ్య సంచలన నిర్ణయం..

Share Icons:

హైదరాబాద్, 14 జనవరి:

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా  వచ్చిన చిత్రం ఎన్టీఆర్..‘క‌థానాయ‌కుడు’. బాలయ్య స్వయంగా నిర్మాతగా ఉన్న ఈ  సినిమాకి టాక్ బాగున్నా..కలెక్షన్స్ పరంగా బాగా పూర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా వచ్చాయి. పోనీ వీకెండ్‌లో అయినా నిలబడుతుంది అనుకంటే అలాంటిదేమీ కనపడలేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, ఆయన టీమ్.. ఈ సినిమా ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌ని ఆదుకునేందుకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారట. 

రెండవ పార్ట్ అయిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఉచితంగా ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ కు తెలియచేసారని, అయితే అఫీషియల్ గా లెటర్స్ ఏమీ ఇవ్వలేదని సమాచారం. ఇక ఈ వార్తతో డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారట. సెకండ్ పార్ట్ లో పూర్తి రాజకీయ జీవితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారట. పిభ్రవరి 7 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ పైనల్ స్టేజ్‌లో ఉంది. 

మామాట: మరి రెండో పార్ట్ అయిన కలెక్షన్ రాబడుతుందా..

Leave a Reply