బజాజ్ డోమీనార్ 400 ధర తగ్గింపు…

Share Icons:

ముంబై, 3 మే:

భారత్ మోటార్ సైకిల్స్ మార్కెట్లో అమ్మకాల్లో దూసుకెళుతున్న బజాజ్ డోమినార్ 400 బైక్ ధర తగ్గింది. ఇటీవలే ఈ బైక్ అప్‌డేట్ చేయబడింది. ఈ అప్‌డేట్ చేయబడిన బైక్ ధరను రూ. 1,73,870గా నిర్ణయించింది. అయితే, ఈ ధరపై బజాజ్ ఆటో రూ. 3,723 తగ్గింపును ప్రకటించింది.

ఇక అప్‌డేట్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన డోమినార్ 400 ఫీచర్లలో కొంత మార్పు చోటు చేసుకుంది. ముందు భాగంలో లప్‌సైడ్ డౌన్ సస్పెన్షన్ యూనిట్, స్లీకర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉన్నాయి. కొత్త ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో.. డ్యూయెల్ ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్(డీఓహెచ్‌సీ) సెటప్ చేయబడి ఉంది.

373.4సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 8,650 ఆర్పీఎం వద్ద 39.4బీహెచ్ఎం విడుదల చేస్తుంది. 7,000 ఆర్పీఎం నుంచి 35ఎన్ఎం టర్క్ విడుదలవుతుంది. రీ-వర్క్‌డ్ ఎర్గోనామిక్స్‌తో ఈ బైక్ సుదూర సులభంగా ప్రాంతాలకు వెళ్లగలదు.

మామాట: బజాజ్ వినియోగదారులకి బంపర్ ఆఫరే..

Leave a Reply