బడ్జెట్ ధరలో కొత్త పల్సర్ 125 నియాన్..

bajaj auto released pulsar 125 neon
Share Icons:

ముంబై:

 

ప్రముఖ దేశీ వాహన తయారీదారు బజాజ్ ఆటొ బడ్జెట్ ధరలో సరికొత్త ఫీచర్లతో పల్సర్ 125 నియాన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.64,000గా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ బైక్‌లో 125 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది డ్రమ్, డిస్క్ బ్రేక్ వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. డ్రమ్ బ్రేక్ వెర్షన్ ధర రూ.64,000. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.66,618

 

పల్సర్ 125 నియాన్ బైక్‌లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. అలాగే బైక్‌లో క్లిప్ ఆన్ హ్యాండిల్‌బార్స్, నియాన్ యాసెంట్‌తో కూడిన గ్రాఫిక్ స్కీమ్, కలర్ కోఆర్డినేటెడ్ పల్సర్ లోగో, గ్రాబ్ రెయిల్, రియర్ కౌల్‌పై 3డీ వేరియంట్ లోగో, బ్లాక్ అలాయ్ మీద నియాన్ కలర్డ్ స్ట్రీక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

 

ఇక ప్రీమియం కమ్యూటర్స్ లక్ష్యంగా ఈ కొత్త పల్సర్ బైక్‌‌ను లాంచ్ చేసినట్లు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు. అదిరిపోయే పనితీరు, స్టైల్, సూపర్ లుక్ వంటి వాటి కోసం స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ కొనుగోలు చేయాలని భావించే కస్టమర్లకు ఆకర్షణీయ ధరలో అందుబాటులో ఉన్న ఈ బైక్ అనువుగా ఉంటుందని పేర్కొన్నారు.

 

 

 

Leave a Reply