‘ఎన్టీఆర్‌’కి బాహుబలి టెక్నాలజీ….బాలయ్య కోసమేనా..!

Bahubali cg technolgy is used to NTR biopic
Share Icons:

హైదరాబాద్, 11 ఆగష్టు:

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, దర్శకుడు క్రిష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌కి ‘బాహుబలి’ సినిమాకి వాడిన టెక్నాలజీని వాడబోతున్నారని సమాచారం. బాహుబలి సినిమాకి ముందు అందులో హీరోయిన్ గా నటించిన అనుష్క బరువు తగ్గాలని ప్రయత్నించి విఫలమైంది.

దీంతో ఆమెను సన్నగా చూపించడం కోసం సీజీ ఎఫెక్ట్స్‌ను వాడారు. టెక్నాలజీని ఉపయోగించుకొని లావుగా ఉన్నవాళ్లని స్లిమ్‌గా ఎలా చూపించవచ్చని బాహుబలి సినిమా ద్వారా అర్ధమయింది.

ఇక ఎన్టీఆర్ చిత్రంలో యవ్వన దశలో కనిపించాల్సిన సీన్లు చాలానే ఉంటాయి. కాబట్టి దానికోసం కొంచెం బొద్దుగా ఉన్న బాలయ్య బరువు తగ్గాలని ఎంతగా వర్కవుట్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అలాగని ఇప్పుడు ఉన్నట్లుగా బాలయ్యని తెరపై చూపించలేరు. దీనికోసం ఇప్పుడు బాహుబలిలో వాడిన టెక్నాలజీను వాడాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అయితే ముందు ఎన్టీఆర్ పాత్రలో ముందుగా శర్వానంద్‌ని తీసుకోవాలనుకున్నారు. కానీ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రలో బాలయ్యనే చూపించాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో విద్యాబాలన్.. బసవతారకం పాత్రలో కనిపిస్తుండగా రానా-చంద్రబాబు, రకుల్ ప్రీత్ సింగ్-శ్రీదేవి, సుమంత్-నాగేశ్వరరావు లాంటి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

మామాట: టెక్నాలజీ ద్వారా ఏదైనా సాధ్యమేలే…!

Leave a Reply