జనసేన బాటలో టీడీపీ… బద్వేల్ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం!?

Share Icons:
  • సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతి
  • ఆయన భార్యకే టికెట్ ఇచ్చిన వైసీపీ
  • బద్వేల్ ఉపఎన్నికలో చేతులెత్తేసిన పవర్ స్టార్…
  • ఆసక్తి చూపని బీజేపీ
  • మేం అభ్యర్థిని నిలపడంలేదు: ఏకగ్రీవం చేసుకోండని వైసీపీకి సలహా
  • జనసేన బాటలోనే టీడీపీ

ఆంధ్రప్రదేశ్ లో ఉపఎన్నిక జరగాల్సిన కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక వైసీపీ నుంచి గెలుపొందిన వెంకట సుబ్బయ్య మృతి చెందటంతో అనివారమైంది. వైసీపీ వెంకట సుబ్బయ్య సతీమణిని డాక్టర్ సుధను అభ్యర్థిగా ప్రకటించింది. జనసేన పోటీ చేయబోటంలేదని ప్రకటించిన నేపథ్యంలో , టీడీపీ కూడా బద్వేల్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.  అక్కడ వైసీపీ అభ్యర్థి సుధ దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిన్నటి వరకు వైసీపీ పై విమర్శలు బాణాలు ఎక్కు పెట్టి తాట తీస్తా ,నార ఆరేస్తా… భయమంటే ఏమిటో చూపిస్తా …. తమాషా చేస్తున్నారా? అంటూ గాండ్రించిన పవర్ స్టార్ వచ్చిన అవకాశాన్ని వదులు కోవడం చేస్తుంటే … వైసీపీ కి ఆయన భయపడ్డారా? లేక చేతులెత్తేశారా? వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గారా? ఏమి జరిగిందో ఏమిటో తెలియదు కానీ బద్వేల్ బరిలో నిలవడంలేదని చెబుతూనే వైసీపీ ని ఏకగ్రీవం చేసుకోండని సలహా ఇచ్చారు. దీనిపై జనసైనికులకే అర్థం కావడంలేదు. మంగళగిరి మీటింగులోను, రాజమండ్రి పర్యటనలోను పులిలా గాండ్రించిన పవర్ స్టార్ పిల్లిలా ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించడం ఏమిటనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి.

పవన్ కల్యాణ్  బెంగళూరు మీదుగా అనంతపురం జిల్లా చేరుకున్నారు. కొత్తచెరువు వద్ద భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలో నిలపడంలేదని వెల్లడించారు.

మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున తాము ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మానవతా దృక్పథంతోనే తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని, బద్వేలు ఉప ఎన్నికను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవచ్చని సూచించారు.

ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ కూడా నిర్ణయించుకుంది. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయరాదని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానించారు. చంద్రబాబు అధ్యక్షతన నేడు పార్టీ పొలిట్ బ్యూరో భేటీ అయింది.  జనసేన పార్టీ బద్వేల్ లో తమ అభ్యర్థిని బరిలో దింపడంలేదని, సంప్రదాయాలను గౌరవించి బద్వేల్ లో పోటీ చేయడంలేదని టీడీపీ నాయకత్వం వెల్లడించింది.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply