చిక్కుల్లో యోగాగురువు …

Share Icons:
  • బాబా రాందేవ్ పై పెల్లుబుకుతున్న వ్యతిరేకత…       
  • అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ విమర్శలు
  • ముజఫర్ పూర్ కోర్టును ఆశ్రయించిన జ్ఞాన్ ప్రకాశ్
  • దేశద్రోహం కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి

యోగాగురువు బాబా రాందేవ్ చిక్కుల్లో పడ్డారు . ఆయన తరుచు అల్లోపతి వైద్య విధానంపై విమర్శలు గుప్పించడం ఇటీవల కాలంతో పరిపాటుగా మారింది. దీనిపై ఐ ఎం ఎ ఆధ్వరంలో పలుమారులు కేంద్రానికి ,ప్రధాని నరేంద్రమోడీకి ఫిర్యాదులు కూడా చేశారు . కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా బాబా రాందేవ్ మాటలను తప్పుపట్టారు. క్షమాపణలు చెప్పామన్నారు . ఆయన తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పినప్పటికీ తిరిగి అల్లోపతి వైద్యం చేసిన విమర్శలు … ఆయనకు చిక్కులను తెచ్చాయి….

కరోనాను కట్టడి చేయడంలో అల్లోపతి వైద్యం విఫలమైందని, రెమ్ డెసివిర్ తదితర ఔషధాలు ఏమాత్రం పనిచేయలేదని, అల్లోపతి వైద్యులు హంతకులని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగుల్చుతున్నాయి. ఇప్పటికే ఆయనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కారాలుమిరియాలు నూరుతోంది.

తాజాగా, బీహార్ కు చెందిన జ్ఞాన్ ప్రకాశ్ అనే వ్యక్తి బాబా రాందేవ్ పై చర్యలు తీసుకోవాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ముజఫర్ పూర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాబా రాందేవ్ అల్లోపతి వైద్యాన్ని, వైద్యులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని జ్ఞాన్ ప్రకాశ్ ఆరోపించారు. బాబా రాందేవ్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని, డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని కోరారు.
-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply