మన తెలుగు సామెతలు (‘ప – ప’ అక్షరములతో)

పంచదార పలుకులు – విషపు చూపులు పంచపాండవులంటే నాకు తెలీదా? మంచపుకోళ్ళులాగా ముగ్గురంటూ రెండువేళ్ళు చూపించాడట పంచాంగం పటపట – విస్తరాకు లొటలొట పంచాంగం పోగానే తిథీ …

సంతోషానికి మించిన సంపద లేదు..

సంతోషానికి మించిన సంపద లేదు..   మనిషి జీవితం చాలా చిన్నది. అందుకే మనం ఉన్నదాంతో సంతోషిస్తూ మనతో పాటు మన చుట్టుపక్కల వారికి కూడా  ఆనందం పంచడమే అసలైన సంతోషం. సంతోషంగా ఉన్నపుడు మనం ఆరోగ్యంగా ఉంటాం.  శరీరం తేలికగా ఉంటుంది. ఏ పనైనా ఇట్టే చేయగలుగుతాం. ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నదీ.. సంతోషంగా ఉండడం మనచేతల్లో, చేతుల్లో ఉంది.  తృప్తిలో ఉన్న ఆనందం దేనిలోనూ రాదు. బంగారం కంచంలో మృష్టాన్న  భోజనం  తినేవాడు ఆనందంగా ఉన్నాడని చెప్పలేం.   ఒక చిన్న పూరింట్లో ఉండే మనిషి తన కుటుంబంతో కలిసి గంజి త్రాగుతూ ఆనందంగా ఉండటాన్ని చూస్తే మనకు ఆనందమెక్కుడుందో అర్థమవుతుంది. జననం-మరణం. ఈ మధ్యలో జీవనయానం అనేక విధాలుగా సాగుతుంటుంది. చదువు, ఉద్యోగం, వివా హం, సంతానం, బాధ్యతలు, బరువులూ, కర్తవ్య నిర్వహణ, అహంకారం, మమకారం, పగ, ప్రతీకారం, కోపం, పుణ్యం, పాపం, స్నేహం, విరోధం, ప్రేమ ఇదే జీవితం. ఎగుడుదిగుడుల కంకర రాళ్ల బాటలో బండి గతుకులతో సాగిపోతుంటుంది జీవితం. సహజం అయిన దాన్ని తనకే ప్రాప్తించే కష్టంలా కాక, ఇది అందరికీ సర్వసాధారణ మని భావించినపుడు అంత బాధ ఉండదు. ఎవరి జీవితమూ పూలబాట కాదు. వడ్డించిన విస్తరి కాదు.   ముళ్లు, రాళ్లూ, పూలూ అన్నీ కలిస్తేనే జీవితం. చేదు రుచి తెలీకుండా తీపి రుచి తెలీదు. కేవలం సుఖాలనే చూసిన తర్వాత కష్టాల్ని చూసిన సిద్ధార్ధుడు బుద్ధునిగా మారిపోవడం మనకు తెలుసు. కష్టసుఖాలు కావడి కుండలని విశ్వసించాలి. జీవితం కోసం జీవించడం ఒక అపూర్వమైన వరము. మనకోసం మనం జీవించాలి. మనచుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తూ, స్నేహభావంతో మెలగాలి. మంచిలోనే సంతోషం ఉందని గుర్తించాలి. గతాన్ని గురించి తలచి చింతించక, భవిష్యత్తు గురించీ భయపడక వర్తమానంలో నర్తించాలి. జీవించే ప్రతిక్షణం మనదిగా భావించాలి. అదే ఆనంద దినోత్సవం. మనం మన జీవితాన్ని ఇష్టపడుతూ మనల్ని మనం ప్రేమించు కుంటూ తోటివారికి ప్రేమ పంచాలి. త్యాగంలోని సంతోషాన్ని అనుభవించాలి. నిరంతరం ఆనందంగా ఉంటూ చుట్టూ ఉన్నవారిని ఆనంద పరచాలి. -నందిరాజు రాధాకృష్ణ

గాంధీ అంటే.. ఒక సత్యం, ఒక అహింస. లోహియా – గాంధి ..  వారిదొక అనుబధం.

గాంధీ అంటే.. ఒక సత్యం, ఒక అహింస. లోహియా – గాంధి ..  వారిదొక అనుబధం ఇరవయ్యో శతాబ్దపు రాజకీయాలు భారత దేశంలో ఒక వ్యక్తి చొరవ, శక్తియుక్తుల చుట్టూనే పరిభ్రమించాయి. ఆయనే …

మన తెలుగు సామెతలు (‘న’ అక్షరంతో)

నంగనాచి తుంగబుఱ్ఱ నంగిమాటల వాడినీ – దొంగ చూపుల వాడినీ నమ్మరాదు నందనవనంలో నాగుపామున్నట్లు నంది అంటే పంది అన్నట్లు నందిని చేయబోయి పందిని చేసినట్లు నందిని …

చరిత్ర చెప్పిన సత్యమిది. 

ప్రతివాడు రాజకీయాలలో విలువలు కాపాడేందుకు సంసిద్ధుడే..పాపం రాజకీయం.. రాజకీయనాయకుడు రంగు మార్చుకుంటే, కొత్త జెండాలు ఎత్తుకుంటే, కొత్త కండువాలు కప్పుకుంటే, అభిమానులు భుజాన వేసుకోవచ్చునేమో! కాని, ఓటర్లు …

మన తెలుగు సామెతలు (‘ద – ధ’ అక్షరములతో)

దంచలేనమ్మ ఊదూది చూచిందట దంచేదొకరైతే ప్రక్కలెగరేసే వాడింకొకడు దండించేదాత లేకుంటే, తమ్ముడు చండప్రచండుడు దండుగలో దండుగ దంపినందుకు బొక్కిందే కూలి దంపినమ్మకు బొక్కిందే దక్కుడు దంపుళ్ళ పాటకు …

నవయుగాల బాట, నార్ల మాట…

పత్రిక అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక ఆయుధం. కీర్తన సంఘం కాదు.. ఎడిటర్ ఎలా ఉండాలి? సంపాదకుడు కారాదు.. అంటూ ఎన్నోచెప్పిన నిఖార్సయిన విలేఖకుడు నార్ల వారు. …

మహోన్నత వ్యక్తి.. ఆయన ఒక శక్తి..

మహోన్నత వ్యక్తి.. ఆయన ఒక శక్తి.. మనకు లభించిన అరుదైన ఆధ్యాత్మిక మహా పురుషులలో జిడ్డు కృష్ణమూర్తి ఒకరు. ఆయన మనిషిగా మహోన్నతి చెందిన వారు. ఒక …

జి కె లో అనూహ్య మార్పు

జి కె లో అనూహ్య మార్పు అలా ఆగస్ట్ 17న పరివర్తన పొందిన జికె (జిడ్డు కృష్ణమూర్తి) కొంత కాలానికి మిత్రులతొ కలసి ఆస్ట్రియాలోని ఎర్వాల్డ్ కు …

జ్ఞానము జ్ఞాపకాల పుట్ట,

జ్ఞానము జ్ఞాపకాల పుట్ట,  ప్రేమ లేని జ్ఞానం నాశన హేతువు: జి కె అన్ని భవబంధాలను వదుల్చుకున్న తరువాత సంపూర్ణ  స్వేచ్ఛతో 70 సంవత్సరాల పాటు నిరాఘాటంగా …

మన తెలుగు సామెతలు (‘త – థ’ అక్షరములతో)

తంగేడు పూచినట్లు తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది – తల్లి చస్తే కాపురం తెలుస్తుంది తండ్రి వంకవారు దాయాదివారు తంతే …

అన్నీ అనుభవించి… ఎనభైల ప్రాయంలో… అప్పుడప్పుడూ ప్రజల కోసం అంటూ…

అన్నీ అనుభవించి… ఎనభైల ప్రాయంలో… అప్పుడప్పుడూ ప్రజల కోసం అంటూ…   *మోహన్ దాస్ కరమ్‌చంద్ మనుమడు (కొడుకు గాంధిదేవదాస్ గాంధి కుమారుడు); చక్రవర్తుల రాజగోపాలాచారి మనుమడు …

చిత్రం భళారే విచిత్రం

సోషల్ మీడియాలో మార్ఫింగ్ లు, ఫేక్ లే ఎక్కువ. వివేకానందునితో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలసి ఉన్నట్లు Pintriestలో దొరికిన ఫోటో ఇది. వారిద్దరూ అంటే ఇష్టం …

మన వేమన పద్యం విశ్వజనీన వేదం  

మన వేమన పద్యం విశ్వజనీన వేదం 1829 లో తొలిసారి సిపి బ్రౌన్ వేమన పద్యాలను ముద్రించారు. తరువాత లభ్యమైన మరి కొన్ని పద్యాలను చేర్చి 1839లో …

సొంత బాకాలుగా తెలుగునాట పత్రికలు, చానళ్ళు

తెలుగునాట పత్రికలు, చానళ్ళ దర్శకత్వంలో పార్టీలు… పార్టీల ప్రమేయంతో ప్రసారమాధ్యమాలు గతంలో రాజకీయపార్టీలకు ఆయా సిద్ధాంతలపై వార్తా పత్రికలుండేవి.  గాంధి హరిజన్, యంగ్ ఇండియ,నెహ్రూ నేషనల్ హెరాల్డ్ …

మన తెలుగు సామెతలు (‘డ – ఢ’ అక్షరములతో)

డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు డబ్బు ఉంటే కొండమీది కోతి కూడా దిగి వస్తుంది డబ్బుకుండే విలువ మానానికైనా లేదు డబ్బుకోసం గడ్డి …

మాట మాత్రానికే ముక్కోణ పోటీనా ?

మాట మాత్రానికే ముక్కోణ పోటీనా ? గ్రేటర్ ఎన్నికలు టి ఆర్ ఎస్ – బి జె పి ప్రత్యక్ష యుద్ధమేనా? ఒక స్థానిక ఎన్నికకు ఇంత …

గ్రేటర్ లో దూకుడు పెంచిన బిజెపి

గ్రేటర్ లో దూకుడు పెంచిన బిజెపి హైదరాబాద్‌‌లో పాలిటిక్స్‌  హీటెక్కాయి. గ్రేటర్ ఫైట్ ఆరంభంలోనే టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. వరద సాయం ఆపారని …

మన తెలుగు సామెతలు (‘జ – ఝ – ఞ’ అక్షరములతో)

జగడమెట్లా వస్తుంది లింగయ్యా, అంటే బిచ్చం పెట్టవే బొచ్చు ముండా! అన్నాడట జంగాలో! దాసర్లో! ముందూరును బట్టి జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్య మెందుకు? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి …

మన తెలుగు సామెతలు (‘చ – ఛ’ అక్షరములతో)

చంక బిడ్డకు దండం అన్నట్లు చంకన పిల్ల – కడుపులో పిల్ల చంకలో పిల్లను వుంచుకుని సంతంతా వెతికినట్లు చంకెక్కిన పిల్ల చచ్చినా దిగదు చందాలిచ్చాం తన్నుకు …

మన తెలుగు సామెతలు (‘గ – ఘ -ఙ’ అక్షరములతో)

గంగకు – దొంగకు – పంగకు తప్పులేదు గంగలో మునిగినా కాకి హంస కాదు గంగిగోవుపాలు గరిటెడైనా చాలు గంజాయి తోటలో తులసి మొక్క గంజి త్రాగేవాడికి …

పుట్టపర్తి సత్యసాయిబాబా 94వ జయంతి 

నవంబరు 23 న సేవాతత్పరుడు, సమతావాది సత్యసాయి 94వ జయంతి పుట్టపర్తి సత్యసాయిబాబా 94వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి అనేకమంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 1926 నవంబర్‌ 23న ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజులకు నాలుగో సంతానంగా సత్యసాయిబాబా జన్మించారు. కొండగుట్టల మధ్య ఉన్న ఓ కుగ్రామమైన గొల్లపల్లిలో ఆయన జన్మించారు. తల్లిదండ్రులు సత్యసాయికి మొదట్లో.. సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారు. 1940 అక్టోబర్‌ 20న తన 14వ ఏట తాను ‘సత్యసాయిబాబా’ను అంటూ తన అవతారాన్ని ప్రకటించుకున్నారు. 1941లో తొలిసారి బాబా భవిష్యవాణిని వినిపించారు. 25వ జన్మదినోత్సవం రోజున ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం చేశారు. అప్పటినుంచి బాబా కీర్తి ప్రతిష్టలు దేశ, విదేశాలకు వ్యాప్తించాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే సనాతన ధర్మాలను ప్రచారం చేస్తూ ప్రశాంతి నిలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆయన బోధనలు నాలుగు ముఖ్య విషయాలఉగా ప్రసిద్ధికెక్కాయి. అవే..ఒకటే కులం – మానవత; ఒకటే మతం – ప్రేమ; ఒకే భాష – హృదయం; ఒకే దేవుడు – అంతటా ఉన్నవాడు. 1954వ సంవత్సరం నుంచి ట్రస్ట్‌ తరపున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవి ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే 1956లో జనరల్‌ ఆస్పత్రి, 1991లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. ఎంతో ఖరీదైన వైద్యాన్ని ఇక్కడ ఉచితంగా అందజేస్తారు. 1964లో విద్యాసేవలు ప్రారంభించారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాలయాలను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందజేస్తున్నారు. 1981లో శ్రీసత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. జిల్లాలో తాగునీటి సమస్యను నివారించేందుకు 1995లో 300 కోట్ల రూపాయలతో భారీ మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. సమాజానికి సేవలు:  సత్యసాయిబాబా సమాజహితంగా అనేక సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. అవి నేటికీ కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాధినేతలు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంతోమంది ప్రముఖులు సత్యసాయిబాబాను దర్శించుకున్నారు.  బాబా శివైక్యం చెందినా.. భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గకుండా ప్రశాంతినిలయం సత్యసాయిబాబా జయంతి వేడుకలకు సిద్దమవుతోంది.  బాబా భౌతికంగా లేకపోయినప్పటికీ తమ హృదయాలలో నెలకొని ఉన్నాడని భక్తులు విశ్వసిస్తున్నారు. మానవ సేవలోనే మాధవుణ్ని చూసి తరించమని భక్తులకు బోధించారు. కుగ్రామమైన పుట్టపర్తిలో పేదలకు వైద్య సౌకర్యార్థం నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఇందుకు ప్రధానమైన ఉదాహరణ. అంతేకాదు కరువుల జిల్లాకు తాగు నీటిసౌకర్యం, పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించే విద్యాలయాల నిర్మాణం, పట్టెడన్నానికి నోచుకోని దీనుల చెంతకే ఆహారం సేవాదళ్‌ కార్యకర్తలు మోసుకెళ్లే అమృత కలశం పథకం, ఇవన్నీ సమాజానికి ప్రేమతో పంచిన వరాలే. సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ మనుషులంతా ఒక్కటేనని చెప్పారు. అన్ని మతాల సారమూ ఒకటేనని, మనిషిని మనిషి ప్రేమించాలి అని   చెప్పారు. వీణలో తీగెలు వేరువేరుగా ఉంటున్నాయి కాని వీణ ఒక్కటే. అదే విధంగా ఈ దేశమంతా ఒక వీణ, మతాలే తీగెలు. వీణలో ఏ ఒక్క తీగె అపస్వరం పలికినప్పటికీ వినడానికి ఇంపుగా ఉండదు, కనుక అన్ని మతాల క్షేమాన్ని, అందరి సంక్షేమాన్ని మనం ఆశించాలి అని   మతసామరస్యం గురించి ఉద్భోదించారు. సత్య సాయి బాబా అధ్వర్యంలో అప్పుడు ప్రత్యక్షంగా, ఇప్పుడు పరోక్షంగా ఆయన సేవా సంస్థల అధ్వర్యంలో అసంఖ్యాకంగా  విద్యా, సేవా, దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఉన్నత విద్య : ప్రశాంతి నిలయంలోని సత్యసాయి ఉన్నతవిద్యా సంస్థ  ప్రస్తుతం దీని పేరు, శ్రీ సత్య సాయి విశ్వవిద్యాలయం).దేశం మొత్తంలో జాతీయ విద్యాప్రమాణ తులనా మండలి ద్వారా “A++” రేటింగ్ పొందిన ఒకే ఒక సంస్థ. ఇదే కాకుండా ఒక సంగీత విద్యాలయం, అనంతపూర్‌లో ఒక (మహిళా) ఉన్నత విద్యాలయం ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాలలోనూ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్య   నేర్పే విద్యాలయాలను స్థాపించాలని వారి ఆశయం. ఇప్పటికి 33 దేశాలలో పాఠశాలలు ప్రాంభించారు. వైద్యం : పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 1991 నవంబరు 22న అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు ప్రారంభించారు. బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్ని హంగులూ గల 333 పడకల ఆసుపత్రి. ఇది 2001 జనవరి 19న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రాంభించారు. ఇవన్నీ పేదవారికి ఉచితంగా వైద్య సదుపాయాలందిస్తున్నాయి. దాదాపు అయిదులక్షల మందికి బెంగళూరులో ఉచిత చికిత్స లభించింది.  అలాగే బెంగళూరు వైట్‌ఫీల్డ్ల్‌ లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ లక్షలాదిమందికి ఉచిత వైద్యం అందించింది. ఇంకా ఎన్నో వైద్యశాలలు గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి. …

మన తెలుగు సామెతలు (‘క – ఖ’ అక్షరములతో)

కంగారులో హడావుడి అన్నట్లు కంచం, చెంబు బయటపారేసి రాయి రప్ప లోపల వేసుకున్నట్లు కంచం పొత్తేగానీ, మంచం పొత్తు లేదు కంచానికి ఒక్కడు – మంచానికి యిద్దరు …

అక్షరాల అశృవులు

దేవిప్రియ, నాలుగక్షరాలు. ఆయనలో సరస్వతీ ‘దేవి..ప్రియ’ మైనది అందరికీ. నాలుగక్షరాల  ఆ హాఫ్ బుష్ షర్ట్ టక్ చేసి, బెల్ట్ తో బిగిస్తాడు, మిత్రులను జారిపోకుండా… నిండుగా …

మన తెలుగు సామెతలు (‘ఒ – ఓ – ఔ’ అక్షరములతో)

ఒంటరి వాని పాటు యింటికి రాదు ఒంటి కంటే జంట మేలు ఒంటికి ఓర్వలేనమ్మ రెంటికి ఓరుస్తుందా? ఒంటి చేతి దాహం – ఒక నాలి పొందు …

మన తెలుగు సామెతలు (‘ఎ – ఏ – ఐ’ అక్షరములతో)

ఎంగిలాకులు ఎత్తమంటే లెక్క పెట్టినట్లు ఎంగిలికి ఎగ్గు లేదు – తాగుబోతుకు సిగ్గు లేదు ఎంచపోతే మంచమంతా కంతలే ఎంచిన ఎరువేదంటే యజమాని పాదమే అన్నట్లు ఎండా …

అదే వచ్చిన చిక్కంతా..

అదే వచ్చిన చిక్కంతా.. పత్రిక అనే అక్షరాల కర్మాగారం పెట్టిన ఆయనకు మాదిరే, ఆయన స్కూల్లో అక్షరాలు బోధించిన గురువులు కానీ, నేర్చుకున్న శిష్యులు కానీ.. మొండి, …

మన తెలుగు సామెతలు (‘ఋ – ఋూ’ అక్షరములతో)

ఋణము – వ్రణము ఒక్కటే ఋణ శేషము, వ్రణశేషము, శత్రుశేషమూ వుండరాదు ఋషీ మూలం, నదీ మూలం, స్త్రీమూలం విచారించరాదు