అటల్ జీ మరణాన్ని వాడుకుంటున్న బీజేపీ

Share Icons:

గ్వాలియర్, ఆగష్టు 24,

పాలక బీజేపీ వ్యవహరిస్తున్న తీరు పై  మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయి మేనకోడలు కరుణా శుక్లా మండిపడ్డారు. ఆమె ఇటీవల ఓ టీవి ఇంటర్యూలో మాట్లాడుతూ, అటల్ జీ మరణాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. బతికుండగా ఆయన వల్ల లబ్ధి పొందిన బీజేపీ, మళ్లీ ఆయన మరణంతో కూడా లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. లేకుంటే ఆయన చితాభస్మ కలశాలతో ర్యాలీలు చేయడం ఏమిటని ఆమె  ఆగ్రహించారు.

ఈ ఇంటర్వ్యూ లో కరుణ బీజేపీ పై ఫైర్ అయ్యారు. బీజేపీది స్వార్ధ రాజకీయం అంటూ నిందించారు. 2019 ఎన్నికల్లో వాజ్‌పేయి మరణాన్ని కూడా సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆమె మండిపడ్డారు.

ఆయన ప్రజల సొత్తు..

అయితే, కరుణ శుక్లా మాటలను అటల్ జీ మరో  మేనకోడలు  కాంతి మిశ్రా ఖండించారు. అటల్ వాజపేయి కరుణకు, తనకు మాత్రమే చెందిన వాడు కాదని, ఆయన ప్రజల మనిషన్నారు. అటల్ జీ మృతికి సంతాపం తెలపాడనికి ప్రతి ఒక్కరూ ఢిల్లీ వెళ్లలేరు, అందువల్లా, అటల్ జీ చితాభస్మానికైనా నమస్కరించుకునే అవకాశం ప్రజలకు దక్కడం సమంజసమేనని కాంతి మిశ్రా అభిప్రాయపడ్డారు.

మామాట: అటల్ జీ ని కూడా ప్రశాంతంగా ఉండనియ్యరా

Leave a Reply