అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువ‌కుడు!

Share Icons:
  • అడ్డుకోబోయిన యువ‌తి అక్క, ఆమె కుమారుడికి గాయాలు

విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం చౌడువాడ‌లో  ఓ అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించి క‌ల‌క‌లం రేపాడు ఓ యువ‌కుడు. ఆ యువ‌కుడిని అడ్డుకోబోయిన యువ‌తి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి.

స్థానికులు, బాధితులు ముగ్గురిని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించి, నిందితుడు న‌ర‌వ‌కు చెందిన రాంబాబుగా గుర్తించారు. ఇటీవ‌ల  యువ‌తితో రాంబాబుకు వివాహం నిశ్చ‌య‌మైంది. ఆ యువ‌తి మ‌రో యువ‌కుడితో మాట్లాడుతోంద‌ని రాంబాబు. చివ‌ర‌కు పెళ్లి ర‌ద్దు చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఇరు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ చెల‌రేగింది. నిన్న రాత్రి ఇరు కుటుంబాల‌ను పిలిచి పోలీసులు రాజీ కుద‌ర్చ‌డంతో పోలీసుల సూచ‌న‌ల‌తో వివాహం చేసుకునేందుకు రాంబాబు ఒప్పుకున్నాడు. కానీ, నిన్న అర్ధ‌రాత్రి స‌మ‌యంలో యువ‌తిపై దారుణానికి పాల్ప‌డ్డాడు రాంబాబు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉంది.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply