బీజేపీపై పోరాటానికి సిద్ధమైన సీపీఐ…

Share Icons:

హైదరాబాద్, 19 జనవరి:

బీజేపీ వ్యతిరేక శక్తులని కూడగట్టుకుని ఎన్దీయే ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని సీపీఐ పార్టీ నిర్వహించిన జాతీయ సమావేశంలో తీర్మానించింది.  ఈ సమావేశంలో రాజకీయ తీర్మానాలు, భవిష్యత్తు  కార్యాచరణ పై చర్చించారు.

అయితే దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిపై రెండు రకాల ఉద్యమాలు చేయాలని భావించారు.  అందులో మొదటిగా దేశ వ్యాప్తంగా ఉన్న సెక్యులర్ శక్తులను ఒకటి చేసి, బి.జె.పి వ్యతిరేక శక్తులను కూడగట్టుకొని ఎన్డియే సాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని నిర్ణయించింది.

అలాగే గోవా,మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ రాజ్యాంగ వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చిందని అన్నారు. భారత రాజ్యాంగం యొక్క భద్రత పట్ల మోడీ ప్రభుత్వ  విధానాలు  సరిగాలేవని, రాజ్యాంగాన్ని మార్చి వేస్తామన్నా బీజేపీ నేతల మాటలు అరికట్టాలని సీపీఐ పిలుపునిచ్చింది. గుజరాత్ ఎమ్మెల్యే జజ్ఞేష్ మేవాని అన్న మాటలు సీపీఐ నేతలు సమర్ధించారు. మేవాని ఏర్పాటు చేయాలన్నా కూటమికి మద్ధతు పలికారు.

ఇజ్రాయిల్ ప్రధాని పర్యటనకు వ్యతిరేకం…

ఇజ్రాయిల్ ప్రధాని నాలుగు రోజుల భారత పర్యటన పట్ల సీపీఐ తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తుంది. పాలస్తీనాను అక్రమంగా ఆక్రమించుకొని వేలాది మంది పౌరులను ఇజ్రాయిల్ చంపించిందని, అలాంటి వారితో మోడీ స్నేహ పూర్వకంగా ఉంటున్నారని మండిపడ్డారు. అరబ్ దేశాలను కూడా ఇజ్రాయిల్ అక్రమించాలని చూస్తుందని. దీనికి అగ్రరాజ్యాం అమెరికా మద్దతు తెలుపుతోందని అన్నారు.

జ్యూడిషియారీ వ్యవస్థకు ప్రమాదం..

అలాగే మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాద దేశాలకు లొంగి పోతుందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు నలుగురు న్యాయమూర్తులు ప్రెస్ కాన్ఫరెస్ తరువాత దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ సభ్యునిగా మాత్రమే డి.రాజా విషయాన్ని తెలుసుకోవడానికి అక్కడికి  వెళ్లారని, ప్రైవేట్ మీడియాలో వామపక్ష పార్టీలు న్యాయవాదుల విషయంలో రాద్దాంతం చేయడం సరైంది కాదని అన్నారు.

దేశంలో జ్యూడిషియారీ వ్యవస్థకు ప్రమాదం వాటిల్లుతుందని అనిపిస్తుందని, న్యాయ మూర్తులను నియమించే అధికారం ప్రధానికి ఇవ్వాలన్నా కుట్ర ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుండి మొదలు అయిందని అన్నారు. లోక్‌పాల్ లాంటి స్వతంత్ర వ్యవస్థ గురించి చర్చ జరగాలని, జ్యూడిషియారీ అథారిటీ ఏర్పాటు వల్ల అనేక సమస్యలు పరిష్కరం అవుతాయి. సీపీఐ పార్టీ జ్యూడిషియారీ యొక్క స్వాతంత్రత పై చర్చ జరగాలని భావిస్తోందని తెలిపారు.

జీఎస్టీపై చర్చ జరగాలి…

జీఎస్టీపై  పూర్తి స్థాయిలో చర్చ జరగాలని సీపీఐ మొదటి నుంచి భావిస్తోందని, జీఎస్టీ విషయంలో కార్పొరేట్ అనుకూల పద్దతులు ఉన్నాయని మండిపడ్డారు. తినే వస్తువుల పై జిఎస్టీ పెంచి వజ్రాల వ్యాపారం లో 3 శాతం ఇచ్చారని, ఇది దేనికి నిదర్శనం అని అన్నారు.

రిలయన్స్ లాంటి కార్పొరేట్ సంస్థల కు మేలు చేకూర్చే విధంగా జీఎస్టీ ఉందని, రిటెల్ రంగంలో ఎఫ్.డి.ఐ  పెంచాలని గతంలో కాంగ్రెస్ భావిస్తే అన్ని పార్టీలు ముక్త కంఠంతో వ్యతిరేకించాయని పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఎఫ్.డి.ఐ అనుమతించడం ద్వారా ఇజ్రాయిల్ లాంటి దేశాలకు వంత పడే అవకాశం ఉందని, దేశానికి రక్షణ పరికరాలు తయారు చేయలేని స్థితిలో ఉన్నామని తెలిపారు. అలాగే  గోరక్ష దళాలు చేస్తున్న దాడులు పట్ల బిజేపీ సమాధానం చెప్పాలి అన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్.ఎస్.ఎస్,సంఘ్ పరివార్ దళితులపై , మైనార్టీల పై చేస్తున్న దాడులు సరికావని, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందన సరిగాలేదని అన్నారు.

రాష్ట్రం విడిపోయాక అభివృద్ధి అయిందన్న కేసీఆర్ మాటల్లో తన పాత్ర ఏంటో చెప్పాలని, సగటు ఆదాయం పెరిగిందన్న మాటల్లో వాస్తవం ఉంటే అది ప్రజలకు పంచుతారని అడిగారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాలో మాత్రమే కాదు మిగిలిన జిల్లాలో జరిగితేనే అభివృద్ధి అయినట్లని సీపీఐ నేతలు సమావేశంలో డిమాండ్ చేశారు.

మామాట: ఎన్నికలకు జవసత్వాలను కూడదీసుకోవడమే…

English summary: At the national convention held by the CPI party, the NDA government has decided to block the anti-BJP forces to prevent anti-people policies. Political conclusions on the meeting discussed the future activity.

Leave a Reply