సాహో దెబ్బకి ఒకేరోజు 10 సినిమాలు విడుదల…

prabhas saaho movie postponed to august 30
Share Icons:

హైదరాబాద్:

 

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన చిత్రం సాహో. ప్రభాస్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు 300 కోట్లపైనే కలెక్షన్ల టార్గెట్ తో వస్తున్న ఈ చిత్రం ఆగష్టు 30న విడుదల అవడానికి సిద్ధమైంది. అయితే టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతుండడం ఎప్పట్నించో ఆనవాయితీగా వస్తోంది. వీకెండ్ లో సినిమా విడుదల అయితే ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడతాయన్నది నిర్మాతల నమ్మకం.

 

చిన్న నిర్మాతలైతే పెద్ద సినిమాల రిలీజ్ తో పోటీపడకుండా సురక్షిత మార్గం ఎంచుకుంటారు. పెద్ద సినిమాకు ముందు రిలీజ్ చేయడమే, లేక తర్వాత తీసుకురావడమో చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో సాహో మేనియా నడుస్తుండడంతో ఈ శుక్రవారం ఏకంగా 10 సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

 

సాహో ఆగస్టు 30న వస్తుండడంతో, చిన్న సినిమాలన్నీ వారం రోజుల ముందే సందడి చేయనున్నాయి. ఆగస్టు 23న చిన్న సినిమాల పండుగ అని చెప్పాలి. కౌసల్య కృష్ణమూర్తి, నేనే కేడీ నెం.1, జిందా గ్యాంగ్, నీతోనే హాయ్ హాయ్, ఏదైనా జరగొచ్చు, బాయ్, ఉండిపోరాదే, కనులు కనులు దోచెనే, నివాసి, హవా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి

Leave a Reply