అసుస్ గేమింగ్ ల్యాప్‌టాప్‌… ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్, 4కె హైబ్రిడ్ బాక్సులు

Asus ROG Zephyrus G GA502 Gaming Laptop Launched in India
Share Icons:

ముంబై:

ప్రముఖ ఎం‌ఎన్‌సి కంపెనీ అసుస్ రోగ్ జెఫిరస్ జి (జీఏ502) పేరిట ఓ నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.99,990 ధరకు ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో అందుబాటులో ఉంది. ఇక ఇందులో 15.6 ఇంచుల డిస్‌ప్లే, ఏఎండీ రైజెన్ 7 3750హెచ్ ప్రాసెసర్, ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1660 టీఐ 6జీబీ జీడీడీఆర్6 గ్రాఫిక్స్ కార్డ్, 16 జీబీ డీడీఆర్4 ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, విండోస్ 10 ఓఎస్, 76 వాట్ అవర్ 4 సెల్ లిథియం-అయాన్ బ్యాటరీ, యూఎస్‌బీ టైప్ సి తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

బ్లూటూత్ స్పీకర్…

సౌండ్ వన్.. షెల్ పేరిట ఓ నూతన బ్లూటూత్ స్పీకర్‌ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ స్పీకర్‌ను రూ.2190 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అయితే లాంచింగ సందర్భంగా దీన్ని కేవలం రూ.1190 కే లిమిటెడ్ పీరియడ్‌లో అందిస్తున్నారు. అలాగే ఇందులో ఐపీఎక్స్5 వాటర్, షాక్ ప్రూఫ్ ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే వాట్ల సామర్థ్యం ఉన్న స్పీకర్, బ్లూటూత్ 5.0, 32 జీబీ వరకు మెమొరీ కార్డు సపోర్ట్, 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఇతర ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్

భారత్ టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్ ఇటీవలే తన ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్, 4కె హైబ్రిడ్ బాక్సులను విడుదల చేసింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్ ధర రూ.3,999 ఉండగా దీన్ని ఎయిర్‌టెల్ రిటెయిల్ స్టోర్స్, ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్టిక్‌ను కొనుగోలు చేసిన వారికి 30 రోజుల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. ఆ తరువాత ఏడాది కాలానికి గాను రూ.999 ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.  ఇందులో ఆండ్రాయిడ్ 8.0, ఓటీటీ యాప్ స్ట్రీమింగ్, వింక్ మ్యూజిక్, గూగుల్ ప్లే స్టోర్ యాప్స్‌కు సపోర్ట్, 1.6 గిగాహెడ్జ్ ప్రాసెసర్, బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్, బ్లూటూత్ 4.2 వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

అటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌లో ఆండ్రాయిడ్ 9.0 పై, ఓటీటీ యాప్స్ స్ట్రీమింగ్ సపోర్ట్, 500కు పైగా లైవ్ టీవీ చానల్స్, వైఫై, బ్లూటూత్, బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ సెర్చ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ బాక్సును కూడా రూ.3999 ధరకు అందిస్తున్నారు. అయితే ఎయిర్‌టెల్ డీటీహెచ్ కస్టమర్లు దీన్ని రూ.2249 కే కొనుగోలు చేయవచ్చు.

 

Leave a Reply