ఆకర్షణీయమైన ఫీచర్లతో మూడు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

asus released zenbook flip series laptops in india
Share Icons:

ముంబై:

ప్రముఖ మొబైల్స్ తయారీదారు అసుస్ సంస్థ మూడు నూతన ల్యాప్‌టాప్‌లను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. జెన్‌బుక్ ఫ్లిప్ 13, జెన్‌బుక్ 14, 15 మోడల్స్‌లో ఆ ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యాయి. అసుస్ జెన్‌బుక్ ఫ్లిప్ 13 ప్రారంభ ధర రూ.76,990 ఉండగా, జెన్‌బుక్ 14 రూ.79,990, జెన్‌బుక్ 15 రూ.1,19,990 ప్రారంభ ధరలకు అందుబాటులో ఉన్నాయి. వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్‌లలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

జెన్‌బుక్ ఫ్లిప్ 13 ల్యాప్‌టాప్‌లో 13.3 ఇంచ్ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఇంటెల్ అల్ట్రా హెచ్‌డీ గ్రాఫిక్స్, 16 జీబీ వరకు ర్యామ్‌కు సపోర్ట్, 512 జీబీ వరకు ఎస్‌ఎస్‌డీ సపోర్ట్, విండోస్ 10 హోం, 50 వాట్ అవర్ 3 సెల్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

అలాగే జెన్‌బుక్ 14 ల్యాప్‌టాప్‌లో 14 ఇంచ్ డిస్‌ప్లే, 5.65 ఇంచ్ సెకండరీ డిస్‌ప్లే (సెకండరీ టచ్ ప్యాడ్), ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఎన్‌వీడియా జిఫోర్స్ ఎంఎక్స్250 గ్రాఫిక్స్, 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ సపోర్ట్, 50 వాట్ అవర్ 3 సెల్ బ్యాటరీ, విండోస్ 10 హోం తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

ఇక జెన్‌బుక్ 15 ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచ్ డిస్‌ప్లే, 5.65 ఇంచుల సెకండరీ డిస్‌ప్లే (సెకండరీ టచ్ ప్యాడ్), ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1650 మ్యాక్స్ క్యూ గ్రాఫిక్స్, 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ సపోర్ట్, 71 వాట్ అవర్ 8 సెల్ బ్యాటరీ, విండోస్ 10 హోం తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

కొత్త వైర్ లెస్ ఫాస్ట్ చార్జర్

స్మార్ట్‌ఫోన్ యాక్ససరీలను తయారు చేసే స్టఫ్ కూల్.. డబ్ల్యూసీ510 పేరిట భారత్‌లో తాజాగా ఓ నూతన వైర్‌లెస్ చార్జర్‌ను విడుదల చేసింది. ఈ చార్జర్‌కు ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. క్యూఐ ప్రమాణాలు కలిగిన ఫోన్లను ఈ చార్జర్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ చార్జర్‌ను రూ.2,999 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. దీనికి టెంపరేచర్, షార్ట్ సర్క్యూట్, పవర్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్‌లను అందిస్తున్నారు. ఈ డివైస్‌పై ఉండే ఎల్‌ఈడీ ఇండికేటర్ సహాయంతో ఫోన్ చార్జింగ్ అవుతుందీ, లేనిదీ సులభంగా తెలుసుకోవచ్చు. ఐఫోన్ 8, 8 ప్లస్, Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్, X ఫోన్లతోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్9, నోట్ 9 తదితర ఫోన్లను కూడా ఈ చార్జర్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు.

 

 

Leave a Reply