ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

Assistant Manager posts in IDBI
Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 13,

అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఐడీబీఐ తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 500 ఖాళీలున్నాయి. అర్హతగల అభ్యర్థులు ఐడీబీఐ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 4న ప్రారంభమైంది. ఏప్రిల్ 15 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవాళ్లందరికీ అన్ని కేంద్రాల్లో ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అందించనుంది ఐడీబీఐ.

మే 6 నుంచి 11 వరకు శిక్షణ ఉంటుంది.

ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ మే 17న ఉండే అవకాశముంది.

అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 500

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04-04-2019

దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2019

అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 30-04-2019

ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్: 06-05-2019 నుంచి 11-05-2019

ఆన్‌లైన్ పరీక్ష: 17-05-2019

అభ్యర్థి కనీస వయస్సు: 21 ఏళ్లు

అభ్యర్థి గరిష్ట వయస్సు: 28 ఏళ్లు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

పూర్తి వివరాలకు దిగువ లింక్ లో చూడండి https://www.idbi.com/pdf/careers/Detailed-Advertisment-AM.pdf

Leave a Reply