సభలు – సమావేశాలు…

Share Icons:

గతంలో రసవత్తర చర్చలు జరుగుతున్న శాసనసభ, శాసన మండలిలో ప్రెస్ గ్యాలరి నిండు కుండలా ఉండేది. నాలుగైదు గంటలసేపు కదలకుండా, కన్నార్పకుండా, కలం మూయకుండా.. కూర్చుండే వాళ్ళం. మర్నాడు పత్రికలు చెణుకులు… చమక్కులతో సహా పొల్లుపోకుండా నిండిపోయేవి. లాబీల్లో ఒకళ్ళో.. ఇద్దరో.. తచ్చాడుతుండే వాళ్ళం.  ఎక్స్పంజ్ డ్.. వాక్యాలు, వ్యాఖ్యలకు పత్రికల్లో  చోటుండేదికాదు. ఆ రోజులు  విలేఖరులకు గర్వించదగిన గోల్డెన్ డేస్.

 

ఆ తరువాత కొందరం విలేఖరులం ఆకాశవాణి, దూరదర్శన్ కు “నేటి శాసనసభ/మండలి సమావేశాల సమీక్ష” లు క్లుప్తీకరించి రాసే వాళ్ళం. మంత్రులు, ఎమ్మెల్యేలుశ్రద్ధగా వినేవారు.   టివీల లైవ్ ప్రసారాలతో..చర్చలు రచ్చ రచ్చలు అయ్యాయి. పార్టీల పరంగా పత్రికలు, చానళ్ళు  విస్తరించడంతో కలాలకు పని తప్పింది. గ్యాలరీ నిల్లయి, లాబీ ఫుల్ అయింది. మసాలా దట్టించిన  కథలు, కమామిషి…తో లాబీ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సభలో కంటే మీడియా పాయింట్ లో సభ్యుల ఉపన్యాసాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, కొండొకొచో…పంచాంగాలు, తోపులాటలకు మంచి కవరేజ్. మీడియా పాయింట్  కెమేరాలు, సివిల్ డ్రెస్ లో పోలీసులు, విలేఖరులు, పొలిటిషియన్స్ కబుర్లకు అడ్ఢా.  నిజంగా ఆ తరం లోని మాతరం.. అదృష్ట వంతులం. కొన్ని కీలక సమయాల్లో కొందరు ఎడిటర్లు  స్వయంగా సభకు వచ్చి ప్రత్యక్షసాక్షులై విశ్లేషణలు, ఎడిటోరియల్ రాసేవారు. రోజులు    మారాయి.

 

ఈ 2020 కొత్తశకం.. ప్రారంభమయిన నూతన ప్రక్రియ ఏమిటంటే, “వర్క్ ఫ్రమ్ హోమ్” జర్నలిజం. టీవీలు చూడడం, లాప్ టాప్, మొబైల్, టాబ్..లపై టకటక..

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply