మూడో పతకం ఖాతాలో వేసుకున్న భారత్…

Asian games india won the bronze medal
Share Icons:

ఇండోనేసియా, 20 ఆగష్టు:

ఇండోనేసియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత్ మూడో పతకాన్ని దక్కించుకుంది. అయితే ఆదివారం మొదలైన పోటీల్లో భారత్‌కు ఓ పసిడి, కాంస్య పతకం దక్కిన సంగతి తెలిసిందే. పురుషుల 65కిలోల ఫ్రీైస్టెల్ రెజ్లింగ్‌లో బజ్‌రంగ్ పూనియా పసిడి పతకంతో మెరవగా, 10మీటర్ల ఎయిర్‌రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంటులో అపూర్వీ చండేలా, రవికుమార్ ద్వయం కాంస్య పతకం దక్కించుకుంది.

మరోవైపు కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లు ఘనవిజయాలతో ముందంజ వేయగా, బ్యాడ్మింటన్‌లో పురుషుల జట్టు శుభారంభం చేసింది. మహిళల హాకీ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇండోనేషియాను 8-0 తేడాతో చిత్తు చేసింది.

ఇక రెండో రోజు కూడా భారత్ రజత పతకంతో బోణీ చేసింది. భారత షూటర్ దీపక్ కుమార్ సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో రెండోస్థానంలో నిలిచాడు.
ఈ పోటీలో దక్షిణ కొరియా ఆటగాడు సాంగ్ సూజూ 629.7 పాయింట్లతో తొలిస్థానంలో నిలవగా, దీపక్ కుమార్ 626.3 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇక పసిడి, రజతం, కాంస్య మూడు పతకాలతో భారత్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.

మామాట: ఇంకా ఎన్ని సాధిస్తారో చూడాలి…

Leave a Reply