కొత్త ఢిల్లీ, సెప్టెంబర్ 02,
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ఇవాళ మరో పతకం వచ్చింది. స్క్వాష్ మెన్స్ టీమ్.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. సెమీస్‌లో హాంగ్ కాంగ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది.సెయిలింగ్‌లోనూ భారత్‌కు కాంస్య పతకాలు వచ్చాయి. 49 మెన్స్ సెయిలింగ్ ఈవెంట్లో వరుణ్ అశోక్ తక్కర్, గణపతి కీలపండ చెంగప్పలు.. టీమ్ ఈవెంట్లో కాంస్యం పతకం సాధించారు. 1500మీటర్ల పరుగులో భారత సూపర్ స్ప్రింటర్ జిన్సన్ జాన్సన్, 4×400మీ మహిళల రిలేలో భారత బృందం పసిడి పతకాలతో మెరవగా.. 4×400మీ పురుషుల టీమ్ రిలేలో భారత జట్టు రజతం సాధించింది. కాగా, డిస్కస్‌త్రోలో డిఫెండింగ్ చాంపియన్ సీమా పునియా, మహిళల 1500మీ రేసులో చిత్రా ఉన్నిక్రిష్ణన్ కాంస్య పతకాలు సాధించి అబ్బుర పరిచారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అథ్లెట్లు మెరుపులు మెరిపించడంతో ఆసియా క్రీడలలో భారత్ అంచనాలకు తగినట్లే పతకాలు సాధించగలిగింది. ఇప్పటివరకు అథ్లెటిక్స్‌లో 7 స్వర్ణ, 10 రజత, 2 కాంస్యాలతో అదరగొట్టిన భారత అథ్లెట్లు .. ఆసియా తొలి క్రీడల్లో (1951) అథ్లెటిక్స్‌లో సాధించిన పతకాల రికార్డును సమం చేశారు.
అంతేకాదు..18వ ఆసియా క్రీడలలో 59 పతకాలతో అత్యధిక పతకాలు సాధించిన రికార్డును నమోదు చేసింది. గతంలో ఒకే క్రీడలలో 57 పతకాలను మించి సాధించలేదు. తాజాగా అథ్లెట్లు అమోఘంగా రాణించడంతో అరుదైన రికార్డును భారత్ లిఖించింది. మరో రెండు స్వర్ణాలు సాధిస్తే స్వర్ణాలలో 2014 రికార్డును అందుకుంటుంది.ఇక పురుషుల 4X400 మీటర్ల రిలేలోనూ భారత అథ్లెట్లు అదరగొట్టారు. కును మహ్మద్, ధరున్ అయ్యసామి, అనాస్, అరోకియా రాజీవ్‌లతో కూడిన భారత బృందం 3నిమిషాల1.85 సెకన్ల సమయంతో రేసును పూర్తి చేసి రెండోస్థానంలో నిలిచి వెండి పతకాన్ని ముద్దాడారు. తొలిస్థానంలో నిలిచిన ఖతార్ బృందం 3 నిమిషాల 56 సెకన్లతో స్వర్ణం నెగ్గారు. తొలిల్యాప్లో కును పరుగెత్తగా రెండోల్యాప్లో అయ్యసామి వెనుకంజతో ఖతార్‌కు ఆధిక్యం దక్కింది. అనాస్, రాజీవ్ ఎంతగా పరుగెత్తినా రెండోస్థానమే దక్కడంతో భారత బృందం రజతంతో సంతృప్తి పడింది.మహిళల 4×400 మీటర్ల పరుగులో భారత మహిళల జట్టు 20 ఏండ్ల రికార్డును నిలబెడుతూ మళ్లీ పసిడి ఒడిసిపట్టింది. యువ స్ప్రింటర్ హిమదాస్, పూవమ్మ, సరితా గైక్వాడ్, వీకే బిస్మయాలతో కూడిన భారత రిలే జట్టు ఆసియా క్రీడల రిలేలో ఆధిపత్యాన్ని కొనసాగించింది.
తొలుత పరుగు మొదలుపెట్టిన హిమదాస్ చిరుతలా పరుగెడుతూ పూవమ్మకు బ్యాటన్ అందించే సమయానికి భారీ ఆధిక్యాన్ని అందించింది. ఇదే ఆధిక్యాన్ని కొనసాగిస్తూ పూవమ్మ.. సరితకు బ్యాటన్ అందించగా..ఆఖరివరకు ఆధిక్యంలోనే కొనసాగిన భారత జట్టు 2002 ఆసియా క్రీడల నుంచి ఈ విభాగంలో స్వర్ణాలు గెలుస్తున్న సంప్రదాయాన్ని నిలబెట్టింది. తృటిలో ఆసియా క్రీడల రికార్డు సమయం(3నిమిషాల 28.68 సెకన్లు)సవరించే అవకాశం కోల్పోతూ 3నిమిషాల 28.72 సెకన్లలో గమ్యం చేరి స్వర్ణం దక్కించుకోగా..రెండోస్థానంలో నిలిచిన బహ్రెయిన్ రజతం అందుకుంది.మరోవైపు 1500మీటర్ల పరుగులో చిత్రా ఉన్నిక్రిష్ణన్ సంచలన విజయంతో మెరుపులు మెరిపించింది. మిడిల్ డిస్టెన్స్ రన్నర్‌గా దేశవాళీ టోర్నీలలో రాణించిన చిత్రా ఆసియా క్రీడల 1500 మీటర్ల పరుగులో 4 నిమిషాల12.56 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడోస్థానంతో కంచుపతకం అందుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో తొలి పతకాన్ని సాధించిన రికార్డు అందుకుంది. మహిళల డిస్కస్ త్రోలో డిఫెండింగ్ చాంపియన్ సీమా పునియా ఈసారి కాంస్యంతో సంతృప్తి పడింది.
మామాట: క్రీడల్లో రాజకీయాలుపోతే మరన్ని పతకాలు రావా