మొండికేస్తున్న ఆర్యన్ ఖాన్…

Share Icons:
  •  జైల్లో అన్నం నీళ్లు ముట్టకుండా
  • డ్రగ్స్ వ్యవహారం కేసులో జైలులో ఆర్య‌న్

ముంబై తీరంలో షిప్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం కేసులో విచారణ జరుపుతోన్న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు తో ఆర్యన్‌ ఖాన్  ప్రస్తుతం ముంబై కేంద్ర కారాగారంలో రిమాండులో వున్నాడు.

సకల సౌక‌ర్యాలు ఉండే అధునాతన భ‌వ‌నంలో నివాసం, ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో భోజ‌నం, నౌక‌ల్లో పార్టీలతో జ‌ల్సాగా గ‌డిపే ఆర్యన్‌ ఖాన్‌.. ఇప్పుడు జైలు జీవితాన్ని అనుభ‌వించ‌లేక‌, బ‌య‌ట‌కు రాలేక మాన‌సిక వేధ‌న‌ అనుభ‌విస్తున్నాడు. జైలులో అతడు భోజనం చేయట్లేడని, నీళ్లు కూడా  తాగ‌ట్లేడదని జైలు అధికారులు తెలిపినట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అత‌డి ఆరోగ్యం గురించి జైలు అధికారుల ద్వారా షారుఖ్ ఖాన్‌ వివరాలు తెలుసుకుంటున్నాడు.

ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముంబైలోని సెషన్స్ కోర్టులో వాదనలు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

 

Leave a Reply