విజయ్ మాల్యా కోసం సిద్ధంగా ఉన్న ఆర్థర్ రోడ్డు జైలు  

Share Icons:

లండన్, ఫిబ్రవరి 09,

 దేశీయ బ్యాంకులకు వేలకోట్లు టోపీ పెట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు లండన్ కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో  భారత ప్రభుత్వం, ఆయన కోసం ముంబైలోని జైలు బారెక్‌ను సిద్ధం చేసింది. మాల్యాను ఆర్థర్ రోడ్డులోని జైలు లో ఉంచనున్నారు. ఇది ఇప్పటికే ఆయన కోసం సిద్ధంగా ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు. మాల్యా ఇక్కడకు వచ్చాక ఆయన ఆస్తుల వివరాలు చెప్పడం కీలకమని అంటున్నారు.

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్‌తో పాటు మాల్యా తన ఇతర ఆర్థికలావాదేవీల గురించి వాస్తవాలు చెప్పవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. త్వరలోనే  మాల్యాను భారత్ తీసుకు రానున్నట్లు తెలిపారు. ఇతర ఆర్థిక నేరస్థుల కేసుల్లో మాల్యా కేసు ఉదాహరణగా నిలుస్తుందని అంటున్నారు. కాగా ఇక్కడకి వచ్చిన తరువాత కూడా మాల్యా తన వాదనలకే కట్టుబడి ఉంటాడనీ, తాను కట్టవలసిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఆస్తులు జప్తు చేశారనే మాటపై పోరాటం చేస్తారని ఆయన వర్గీయులు తెలిపారు.

మామాట: మాల్యాను కాదు, అతను తిన్న డబ్బులు కక్కించండి…

Leave a Reply