మామాటలో మీమాట పోల్ నెం.18 – క్రేజీ నిరసన అవసరమా…

Share Icons:

గత ఆరు రోజులుగా దిల్లీ గవర్నర్ నివాసంలో సీఎం కేజ్రీవాల్ పడిగాపులు, ఆరోగ్యం విషమం అంటూ పుకార్లు. ఆసుపత్రికి తరలించడానికి సిద్ధంగా రాజ్ భవన్ వద్ద నాలుగు అంబులెన్సులు.. అంతకంతకూ వేడెక్కుతున్న దిల్లీ రాజకీయం.

 

[pinpoll id=”57749″]

ఆయన గతంలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి, దేశంలో అవినీతి పెరిగిపోయిందని ఆందోళన చేపట్టి, ఆప్ పార్టీ పెట్టి, దేశరాజధాని దిల్లీకి ముఖ్యమంత్రి గా ఎంపికైన కేజ్రీ వాల్ తొలి నుంచి సంచలనాలకు నెలవుగా ఉంటున్నారు. దిల్లీ ప్రజలకే కాకుండా, దేశంలోని కోట్లాది

మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను మోస్తున్న కొత్తతరం నేతగా తెరపైకి వచ్చిన కేజ్రీవాల్ ఆ ఉన్నత విలువలను కొనసాగించలేకపోతున్నారని విమర్శకులు భావిస్తున్నారు.

దిల్లీలో ఆప్ పాలన మొదటి నుంచీ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. కేజ్రీ ఒంటెద్దుపోకడలతో ఆప్ పార్టీ అనేక ఒడిదుడుకులకులోనైన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అవినీతి వ్యతిరేకపోరాటం

లోనుంచీపుట్టుకొచ్చిన ఆప్ తొలిరోజులనుంచే అవినీతి మకిలిపులుముకున్న విషయం తెలిసిందే. ఇక దిల్లీకి కేంద్రానికి మధ్య అనేక విషయాల్లోప్రత్యక్షయుద్దంనెలకొంది.

 రాజధాని నగరంలో మురుగు తొలగించే అంశం నుంచి, పోలీసు కానిస్టేబుల్ బదలీల లీలల వరకూ అన్నీమీడియాలోకెక్కినవే కదా.

 

అటు మోనార్క్ ప్రధాని మోదీ ఇటు దేనికీ తగ్గని కేజ్రీవాల్ ల వ్యవహార శైలి దేశం మొత్తానికీ వినోదంపంచుతోంది. ఒక రోజు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే కేజ్రీ-మోదీలు మధ్య అంతలోనే నీ కాళ్లు మొక్కుతా  అని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అనేవరకూ వెళుతుంది. అంతలోనే మళ్లీ ఇరువురూ ఒకరిపై ఒకరు కారాలూ మిరియాలూనూరుకుంటూ మాటల యుద్ధం మొదలుపెడతారు.


ఇది ఇలా ఉంటే గత నాలుగు మాసాలుగా దిల్లీ పరిధిలోని ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి సహకరించడంలేదు. వివిధ కారణాలతోవారు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మె వ్యవహారం కేజ్రీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడింది.

అయితే ఐఏఎస్ ల సమ్మె విరమణ విషయంలో కేజ్రీ పాచికలు ఏవీ పారలేదు. దీనితో ఆయన వెర్రెత్తిపోతున్నారు. ఫక్తురాజకీయనాయకునిలాగా ఎదురు పక్షంపై బురదజల్లేందుకు అధికారుల సమ్మె అంశాన్ని వాడుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా, తన మంత్రులతో కలసి గత ఆరురోజులుగా రాష్ట్ర గవర్నర్ అనిల్ బైజాల్ అధిరాక నివాసంలో తిష్టవేశారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. గవర్నర్ ను కలవందే తాను ఇక్కడనుంచీ కదిలేది లేదని రాజ్ భవన్ సిబ్బందికి తేల్చిచెప్పిన కేజ్రీవాల్ సహా ఆయన మంత్రులబృందం అక్కడె బయట విజిటర్స్  గదిలో   విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా కేజ్రీని ఇప్పట్లో చూచే అవసరం ఏమీలేదని భీష్మించుకున్న గవర్నర్ కూడా లోపల తనఅధికార నివాసంలో విలాసవంతంగా జీవిస్తున్నారు. ఏతా వాతా, సామాన్యులే పాలన కుంటుబడి మమ్మలను కరుణించండి ప్రభో అంటూ బోరుమంటున్నారు. రాజకీయంగా మైలేజీ పెంచుకోవడానికి కేజ్రీవాల్, గవర్నర్ లు ఆడుతున్న ఈ దాగుడుమూతలు ప్రజాస్వామ్యానికిమేలుచేస్తాయా. మార్పుకోసం పార్టీపెట్టి అధికారంలోకి వచ్చిన ఆప్ నేత వ్యవహరించ వలసిన తీరిదేనా, సమస్యను పరిష్కరించడానికి ఇంకే మార్గం లేదా, ఇలా ప్రజల మదిలో ఎన్నో ఆలోచనలు సుడి తిరుగుతున్నై. ఇంతకూ గవర్నర్ నివాసంలో ధర్నా చేస్తున్న కేజ్రీ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా.

మామాట:- సీఎం కే దర్శనభాగ్యంలేదా.. గవర్నర్ జీ

Leave a Reply