‘అరవింద సమేత’ ఆడియో ఎప్పుడంటే?

Share Icons:

హైదరాబాద్, 7 సెప్టెంబర్:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ కనిపించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఫ్యాక్షన్ తో ముడిపడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఆడియో రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను హైదరాబాద్ లోని ‘నోవాటెల్’ హోటల్లో నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. అలాగే ఈ ఆడియో ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ లేదా రామ్ చరణ్‌లు రావోచ్చని ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరుగుతోంది.

ఇక సిరివెన్నెల, రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.

మామాట: మరి ఈ అరవింద సమేత అభిమానులని అలరిస్తుందా?

Leave a Reply