సమ్మెకు సన్నాహాలు చేస్తున్న ఏపీఎస్ఆర్టీసీ

Share Icons:

అమరావతి, జూన్ 03,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సన్నాహాలు చేస్తున్నాయి. రేపటి నుంచి 11వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో సమ్మె సన్నాహక సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలిగా రేపు రాజమండ్రిలో ఆర్టీసీ సమ్మె సన్నాహక సభ జరగనుంది.

అనంతరం ఈ నెల 4న శ్రీకాకుళం, విశాఖపట్నంలో, ఈ నెల 6న ఒంగోలులో, ఈ నెల 7న నెల్లూరు, తిరుపతి, ఏలూరులో, ఈ నెల 8న కడపలో, ఈ నెల 9న కర్నూలు, అనంతపురంలో, ఈ నెల 10న గుంటూరులో, ఈ నెల 11న విజయవాడలో సన్నాహక సభలు నిర్వహించనున్నారు.

మామాట- ప్రయాణీకుల ఇబ్బందులు సిబ్బందికి పట్టవేమో…

Leave a Reply