సంచలనం..ట్రాన్స్‌జెండర్‌కి కీలక పదవి ఇచ్చిన రాహుల్…

Share Icons:

ఢిల్లీ, 9 జనవరి:

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన ట్రాన్స్‌జెండర్ అప్సరారెడ్డిని అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారు.

గతంలో జర్నలిస్టుగా బీబీసీ, ది హిందూ వంటి పలు వార్తా సంస్థల్లో ఆమె పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె అన్నాడీఎంకే పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇక జయలలిత మరణం తర్వాత ఆమె బీజేపీలో చేరారు. ఇక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఆమె….నిన్న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇక చేరిన వెంటనే ఆమెకి రాహుల్ అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పజెప్పారు.

అనంతరం అప్సరా రెడ్డి మాట్లాడుతూ..‘‘తనను ట్రాన్స్‌జెండర్‌గా ఎగతాళీ చేశారని.. అద్బుతాలు జరగవని, నిన్ను చూసి నవ్వుతారని…ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో అనే మాటలు తన జీవితంలో ఎన్నో విన్నట్లు తెలిపారు. తనకు ఇంతటి గొప్ప అవకాశం కలిగించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.

మామాట: రాజకీయ రంగంలో మంచి పరిణామమే…

Leave a Reply