యాపిల్ వాచ్ సిరీస్ 5 ధరలు….సెవెన్త్ జనరేషన్ ఐప్యాడ్…

Apple Watch Series 5 Price in India Detailed
Share Icons:

ముంబై: ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ తాజాగా వాచ్ సిరీస్ 5 నూతన స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసినే. ఇందులో ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్‌ప్లే, బిల్టిన్ కంపాస్, ఎమర్జెన్సీ కాలింగ్, వాచ్ ఓఎస్ 6, 18 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ వాచ్ సిరీస్ లో ధరలు ఇలా ఉన్నాయి.

యాపిల్ వాచ్ సిరీస్ 5 జీపీఎస్, 40ఎంఎం, అల్యూమినియం – ధర రూ.40,900

యాపిల్ వాచ్ సిరీస్ 5 జీపీఎస్, 44ఎంఎం, అల్యూమినియం – ధర రూ.43,900

యాపిల్ వాచ్ సిరీస్ 5 జీపీఎస్+సెల్యులార్, 40ఎంఎం, అల్యూమినియం – ధర రూ.49,900

యాపిల్ వాచ్ సిరీస్ 5 జీపీఎస్+సెల్యులార్, 44ఎంఎం, అల్యూమినియం – ధర రూ.52,900

యాపిల్ వాచ్ సిరీస్ 5 జీపీఎస్+సెల్యులార్, 40ఎంఎం, స్టెయిన్‌లెస్ స్టీల్ – ధర రూ.65,900

యాపిల్ వాచ్ సిరీస్ 5 జీపీఎస్+సెల్యులార్, 44ఎంఎం, స్టెయిన్‌లెస్ స్టీల్ – ధర రూ.69,000

యాపిల్ వాచ్ నైకి సిరీస్ 5 జీపీఎస్, 40 ఎంఎం, అల్యూమినియం – ధర రూ.40,900

యాపిల్ వాచ్ నైకి సిరీస్ 5 జీపీఎస్, 44 ఎంఎం, అల్యూమినియం – ధర రూ.43,900

యాపిల్ వాచ్ నైకి సిరీస్ 5 జీపీఎస్+సెల్యులార్, 40 ఎంఎం, అల్యూమినియం – ధర రూ.49,900

యాపిల్ వాచ్ నైకి సిరీస్ 5 జీపీఎస్+సెల్యులార్, 44 ఎంఎం, అల్యూమినియం – ధర రూ.52,900

అలాగే యాపిల్ 7వ జనరేషన్ నూతన ఐప్యాడ్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో 10.2 ఇంచుల డిస్‌ప్లే, ఆపిల్ ఎ10 ఫ్యుషన్ ప్రాసెసర్, 32, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు, ఐఓఎస్ 13, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 1.2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ (ఆప్షనల్), టచ్ ఐడీ, 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ ఐప్యాడ్‌కు చెందిన వైఫై మోడల్ ప్రారంభ ధర రూ.29,900 ఉండగా, వైఫై+సెల్యులార్ మోడల్ ప్రారంభ ధర రూ.40,900 గా ఉంది. సెప్టెంబర్ 30వ తేదీ తరువాత ఈ ఐప్యాడ్‌ను విక్రయించనున్నారు.

అమేజ్‌ఫిట్ జీటీఆర్ స్మార్ట్‌వాచ్‌

అమేజ్‌ఫిట్ జీటీఆర్ పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను హువామీ కార్పొరేషన్ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 1.39 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ కనెక్టివిటీ, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 410 ఎంఏహెచ్ బ్యాటరీ, 24 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.10,999 ధరకు ఈ వాచ్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు

Leave a Reply