TRENDING NOW

గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని కనిపెట్టే వాచ్‌లు…

గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని కనిపెట్టే వాచ్‌లు…

కాలిఫోర్నియా, 14 సెప్టెంబర్:

వాచ్‌లతో టైమ్ తెలుసుకోవచ్చు. సెన్సార్స్ ఉంటే ఆ వాచ్ పెట్టుకున్న వ్యక్తి ఉన్న చోటు, మాటలు, వాతావరణం లాంటివి తెలుసుకోవచ్చు కానీ, వాచ్ పెట్టుకోవడం వల్ల ముందుగా రాబోయే గుండె జబ్బులని తెలుసుకోవచ్చా..? ఇకపై తెలుసుకోవచ్చు.

వినడానికి వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఇక మీదట మీరు ఈ వాచ్ పెట్టుకుంటే గుండె జబ్బులు రాబోయే అవకాశాన్ని ముందే పసిగట్టొచ్చు. ఇంతకీ ఏం వాచ్ అది? ఇదంతా ఎలా సాధ్యం అనుకుంటున్నారా…? అయితే తెలుసుకుందాం రండి.

యాపిల్ స్మార్ట్ వాచ్‌లతో సాధ్యమే…

గరువారం జరిగిన యాపిల్ గ్యాద‌ర్ రౌండ్ ఈవెంట్‌లో యాపిల్ సంస్థ కొత్త ఐఫోన్ల‌ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటితోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 4 స్మార్ట్‌వాచ్‌ల‌ను కూడా విడుదల చేసింది.

గ‌తంలో వ‌చ్చిన యాపిల్ వాచ్‌ల క‌న్నా సిరీస్ 4 వాచ్‌లు 30 శాతం పెద్ద‌విగా ఉంటాయ‌ని యాపిల్ తెలిపింది. ఇక ఈ నూత‌న సిరీస్‌లో ప‌లు నూత‌న వాచ్ ఫేస్ ల‌ను కూడా యాపిల్ అందిస్తున్న‌ది. గ‌తంలో వ‌చ్చిన యాపిల్ వాచ్‌ల‌ క‌న్నా సిరీస్ 4 వాచ్‌లు 50 శాతం ఎక్కువ సౌండ్ అవుట్ పుట్‌ను ఇస్తాయి. సిరీస్ 4 వాచ్‌ల‌లో అధునాత‌న ఎస్‌4 చిప్‌ను, 64 బిట్ డ్యుయ‌ల్ కోర్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా తొలిసారిగా సిరీస్ 4 వాచ్‌ల‌లో ఎల‌క్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) చిప్‌ను అమ‌ర్చారు. దీని వ‌ల్ల యూజ‌ర్లు ఎప్పుడైనా, ఎక్క‌డైనా వాచ్‌లోని ఈసీజీ యాప్ ద్వారా త‌మ ఈసీజీ చెక్ చేసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల యూజ‌ర్లు త‌మ‌కు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాన్ని ముందుగానే ప‌సిగ‌ట్ట‌వ‌చ్చు. గుండె కొట్టుకునే రేటు, ప‌లు ఇత‌ర అంశాల ఆధారంగా యాపిల్ సిరీస్ 4 వాచ్‌లు యూజ‌ర్లకు గుండె జ‌బ్బుకు చెందిన స‌మాచారాన్ని తెలియ‌జేస్తాయి. ఈ వివ‌రాల‌న్నింటినీ పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో యాపిల్ వాచ్ స్టోర్ చేస్తుంది. అనంత‌రం వాటిని డాక్ట‌ర్ల‌తో షేర్ చేసుకోవ‌చ్చు.

ధర తక్కువేం కాదు…

యాపిల్ వాచ్ సిరీస్ 4 జీపీఎస్ ఎడిష‌న్ ధ‌ర 399 డాల‌ర్లు (దాదాపుగా రూ.28,686). అలాగే వాచ్ సిరీస్ 4 జీపీఎస్‌, సెల్యులార్ ఎడిష‌న్ ధ‌ర 499 డాల‌ర్లు (దాదాపుగా రూ.35,875). యాపిల్ వాచ్ సిరీస్ 4 వాచ్‌లు గోల్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్ క‌ల‌ర్, సిల్వ‌ర్‌, స్పేస్ బ్లాక్ స్టెయిన్ లెస్ స్టీల్ మోడ‌ల్స్‌లో లభ్యం కానున్నాయి.

యాపిల్ వాచ్ సిరీస్ 4 జీపీఎస్ ఎడిస‌న్ ఈ నెల 14వ తేదీ నుంచి 26 దేశాల్లో ల‌భిస్తుంది. అలాగే యాపిల్ వాచ్ సిరీస్ 4 జీపీఎస్‌, సెల్యులార్ ఎడిష‌న్ 16 దేశాల్లో ల‌భిస్తుంది. ఈ రెండు మోడ‌ల్స్ ఈ నెల 21వ తేదీ నుంచి స్టోర్స్‌లో యూజ‌ర్ల‌కు ల‌భ్యం కానున్నాయి. అయితే భార‌త్‌లో ఈ వాచ్‌లు ల‌భ్య‌మ‌య్యే తేదీల‌ను మాత్రం ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

మామాట: పెరుగుతున్న టెక్నాలజీతో అంతా సాధ్యమేనా

 

(Visited 21 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: