జనసేనలోకి అబ్దుల్ కలాం సలహాదారుడు

Share Icons:

అమరావతి, ఫిబ్రవరి 09,

దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సలహాదారునిగా పని  పొన్ రాజ్‌ను జనసేన పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ…  అబ్దుల్ కలాం సలహాదారుగా ఉంటూ దేశానికి ఎంతో సేవ చేసిన పొన్ రాజ్ జనసేన పార్టీ సలహామండలిలో ఉండడం ఆనందంగా ఉందన్నారు. పొన్ రాజ్ సూచనలు, సలహాలు, అనుభవం బడుగు బలహీనవర్గాల వారిని అభివృద్ధిలోకి తెచ్చేందుకు పకరిస్తుందన్నారు. ఈ సందర్భంగా పోన్ రాజ్ మాట్లాడుతూ… పవన్ క్రియేటివ్ లీడర్ అని, ఏపీ అభివృద్ధి కోసం ఆయన విజన్ తనకెంతో నచ్చిందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలన్న అభిలాష అబ్దుల్ కలాంలో ఉండేదని, పవన్‌లో కూడా ఆ తపన కనిపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావలసిన వనరులు, యువ నైపుణ్యాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు.

రక్షణ రంగ శాస్త్రవేత్త…

తమిళనాడుకు చెందిన వి పొన్ రాజ్ రక్షణరంగ శాస్త్రవేత్త. టెక్నాలజీ ఇంటర్‌ఫేజ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అబ్దుల్ కలాం సాంకేతిక సలహాదారుగా ఉన్న సమయంలో ఆయనకు సలహాదారుగా వ్యవహరించారు. అబ్దుల్ కలాంతో పొన్ రాజ్‌కు ఇరవై ఏళ్ల అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రం ఏపీకి ఉపయోగపడుతుందని తాను దృఢంగా విశ్వసిస్తున్నానని చెప్పారు. అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్‌గా పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు.

మామాట: మంచివారు పార్టీలోకి రావడం మంచిదే..

Leave a Reply