చంద్రబాబు,జగన్‌లకు రఘువీరా లేఖ…

Share Icons:

విజయవాడ, 27 ఫిబ్రవరి:

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, దానికి నిరసనగా వచ్చేనెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ, వైసీపీ దూరంగా ఉండాలని చంద్రబాబు, జగన్‌లకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు.

రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతోన్న నిర్లక్ష్యాన్ని, వివక్షను ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారని లేఖలో ఆయన పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలంతా ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని అంశాల అమలులో కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయానికి త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఇరు పార్టీలు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

ఇక రాష్ట్రం నుంచి తెలుగు దేశం పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు దక్కుతాయని, ప్రస్తుతం ఎన్నికలకు దూరంగా ఉన్నంత మాత్రాన టీడీపీ వాటిని శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఏమీ లేదని అన్నారు. అయితే  పార్టీకి దక్కాల్సిన స్థానాలు ఎప్పటికైనా దక్కుతాయని ఆయన తెలిపారు.

అలాగే వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నంత మాత్రాన ఆ పార్టీకి దక్కాల్సిన ఒక స్థానం కూడా ఎక్కడికీ పోదని రఘువీరా అన్నారు. ఇలా చేయడం వలన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచొచ్చని చెప్పారు.

మామాట: ఇలా చేయడం కష్టం అనుకుంటా..

English summary:

APCC President Raghuvira Reddy wrote letters to Chandrababu and Jagan to have stay away from the upcoming Rajya Sabha elections.

One Comment on “చంద్రబాబు,జగన్‌లకు రఘువీరా లేఖ…”

Leave a Reply