రేసు బైక్ అపాచీ ఆర్‌ఆర్310 వచ్చేసింది…

Share Icons:

ఢిల్లీ, 31 మే:

యువతను ఆకట్టుకొనేలా టీవీఎస్‌ మోటార్స్‌ సంస్థ సరికొత్త రేసు బైక్ ‘అపాచీ ఆర్‌ఆర్‌310’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలో సరికొత్తగా రేస్‌ ట్యూన్డ్‌ స్లిపర్‌ క్లచ్‌ను అమర్చారు. 

దీనిలో ఉన్న ట్యూన్డ్‌ స్లిపర్‌ క్లచ్‌ ఫీచర్‌తో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నా స్థిరత్వం మరింత మెరుగుపడుతుంది. ఈ సరికొత్త ఫీచర్‌తో క్లచ్‌ వినియోగం మరింత సులభతరం అవుతుంది. ని పేర్కొంది. ఇది పాంథమ్‌ బ్లాక్‌ రంగులో లభిస్తుంది. ఈ బైక్ ధర రూ.2.27లక్షలుగా నిర్ణయించింది.

అలాగే దీనిలో సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ను అమర్చారు. 313 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను బీఎండబ్ల్యూ, టీవీఎస్‌ మోటార్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 313 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను ఇంజిన్‌ను బీఎండబ్ల్యూ జీ 310 ఆర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్ మోడల్స్‌లోనూ వాడతారు.

ఇక ఇది 7000 ఆర్పీఎం వద్ద 27.3 ఎన్ఎం పీక్ టార్చ్, 9700 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 34బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.

మామాట: రేసులని ఇష్టపడే యూత్ కోసం

Leave a Reply