ఏపీ లో తెలుగు అకాడమీ పేరు మార్పుపై రాద్ధాంతం

Share Icons:
  • విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
  • సంస్కృతంపై ప్రేమ ఉంటే మరో అకాడమీ ఏర్పాటు చేసుకోండి
  • తెలుగు అకాడమీని యథాతథంగా కొనసాగించాలి
  • పరభాష వ్యామోహంతో మాతృభాషను చంపేస్తున్నారు
  • తెలుగు తల్లి విగ్రహానికి వినతి పత్రం సమర్పణ
  • అదేమీ లేదు తెలుగు ప్రక్కన సంస్కృత చేర్చింది అధిక నిధుల కోసమే
  • అందుకోసమే జతచేశాం అంటున్న యార్లగడ్డ 

తెలుగు అకాడెమీ పేరును ఏపీ ప్రభుత్వం తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్చడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్పందించారు. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే తెలుగు అకాడెమీకి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావని, సంస్కృత భాషాభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు వస్తాయని వెల్లడించారు. ఈ కోణంలో, పేరు మార్పు నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడ్డారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply