ఏపీ సీఎస్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన ఎలక్షన్ కమిషనర్…

Share Icons:

అమరావతి: ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు యథావిధిగా జరపాలని.. రాష్ట్రంపై కరోనా ప్రభావం లేదని ఈ మేరకు రమేష్ కుమార్‌కు సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన రమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు పేజీల ఈ లేఖలో పూర్తి కారణాలను నిశితంగా వివరించారు.

ఇంకా లేఖలో ఏముందంటే?

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేశారు. గతంలో రాజ్ భవన్‌లో కంటే ముందు ఆర్థిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశాను. ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దు. గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన  సందర్భాలు ఉన్నాయి. గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారు. కరోనా ఛాలెంజ్ ఎదుర్కుంటున్న ప్రస్తుత దశలో ఏపీ ఒంటరిగా లేదు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను, ఆరోగ్య & కుటుంబ సంక్షేమమంత్రిత్వశాఖతో మార్గదర్శకాలను పాటిస్తున్నాం’ అని లేఖలో రమేష్ కుమార్ పేర్కొన్నారు.

 

Leave a Reply