TRENDING NOW

జగన్‌పై దాడి కేసు: ఎన్‌ఐ‌ఏకి సహకరించని ఏపీ పోలీసులు…

జగన్‌పై దాడి కేసు: ఎన్‌ఐ‌ఏకి సహకరించని ఏపీ పోలీసులు…

విశాఖపట్నం, 5 జనవరి:

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుని ఏపీ ప్రభుత్వ పరిధిలోని సిట్ విచరిస్తుంది.

కానీ ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని కేంద్ర సంస్థతో విచారణ జరిపించాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించింది.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

ఇక ఎన్ఐఏ అధికారులు ఈ కేసు విచారణను చేపట్టేందుకు ఈరోజు ఉదయం విశాఖపట్నంకు చేరుకున్నారు. కేసు వివరాలను తమకు అప్పగించాలని కోరారు. అయితే ఇందుకు విశాఖ పోలీసులు నిరాకరించారు. ప్రభుత్వ అనుమతి లేనిదే తాము ఏమీ చేయలేమని స్పష్టం చేశారు.

కాగా, జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమనీ, కేంద్రం చర్య ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ముఖ్యనేతలతో వ్యాఖ్యానించినట్లు నిన్న వార్తలు వచ్చాయి.
మామాట: కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం భయపడుతుందా…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: