ఇంగ్లీష్ మీడియంకు అదిరిపోయే స్పందన…బాబు నియోజకవర్గంలో కూడా

Share Icons:

అమరావతి: ప్రతి పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో సీఎం జగన్ అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యకు మంచి మద్దతు లభించిందని ఏపీ మంత్రి సురేశ్ అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు మద్దతుగా 45 వేలకు పైగా పాఠశాలల నుంచి తల్లిదండ్రుల కమిటీలు తమ అంగీకారాన్ని తెలియ చేస్తూ తీర్మానం చేశాయని వివరించారు. చంద్రబాబు మొదట ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించి ఆ తరువాత మళ్లీ యూటర్న్ తీసుకున్నారని మంత్రి సురేశ్ విమర్శించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మండలంలో ఉన్న 140 పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని సమర్థిస్తూ తీర్మానం చేశారని ఆయన వివరించారు.

ఇంగ్లీష్ మీడియానికి అంతా సానుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అంతా ఏకీభవిస్తూ, స్వాగతిస్తున్నామని చెప్పి తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. ఆ తీర్మానాలను అన్ని సచివాలయంలో ప్రదర్శన కు పెట్టామని అన్నారు. ఇంగ్లీష్ మీడియంను అమలు చేసేందుకు ఉపాద్యాయులకు శిక్షణ కార్యక్రమం చేపట్టామని… అమ్మఓడి కార్యక్రమనికి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించామని తెలిపారు. ప్రాధమిక స్థాయిలో 1,2,3 తరగతులకు అలాగే 4, 5 తరగతుల వారికి బ్రిడ్జ్ కోర్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

పాఠ్యంశాలను కూడా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని… పాఠ్యపుస్తకాలు, వర్క్ పుస్తకాలు వేర్వేరుగా ఇస్తామని ఏపీ మంత్రి సురేశ్ వివరించారు. విరించారు. జగనన్న విద్యా కానుక ద్వారా బ్యాగ్, యూనిఫార్మ్, బూట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని… ఈ కిట్ మొత్తం ఒక్కొక్కటి 1500 రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. కుట్ర పూరితంగా ఆలోచిస్తున్న వారికి ఈ తీర్మానాలు చెంపపెట్టు అని భావిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సురేశ్ అన్నారు.

 

Leave a Reply