ఇక జనసేన   దుకాణం సర్దేసినట్టేనా..?

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 18,

ఈ కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పును తీసుకొచ్చి తీరుతానని పవన్ సినీ జీవితాన్ని వదిలి జనసేన అనే పార్టీ స్థాపించారు. దీనితో ఏపీ రాజకీయాల్లో జనసేన మూడో బలమైన పార్టీగా అవతరించింది. అయితే ఎన్నికల తరువాత జనంలో అత్యంత ఆదరణ కలిగిన పవన్ కళ్యాణ్ వలన ఏ పాటి ప్రభావం ఉంటుందో అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ నెలకొంది. పార్టీ స్థాపించిన ఐదేళ్లలో పవన్ పలు చోట్ల తన పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభించారు.

తాను పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండడానికే వచ్చానని రాజకీయాలు వీడే ప్రసక్తే లేదని ఇదివరకే చాలా సార్లు ప్రస్తావించారు. కానీ ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో కాదు కదా వచ్చే ఎన్నికల వరకు అయినా జనసేన పార్టీ ఉంటుందా లేక దుకాణం సర్దేస్తుందా అంటూ ఇతర పార్టీల శ్రేణులు సహా కొన్ని చానెళ్లు కూడా సెటైర్స్ వేస్తున్నాయి. జనసేన కార్యాలయాల దగ్గర టూ లెట్ బోర్డులు దర్శనమివ్వడంతో జనసేన పార్టీ శ్రేణులు ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎన్నికలు ముగిసి ఇంకా 10 రోజులు కూడాకాలేదు అప్పుడే ఏపీ లో జనసేన దుకాణం సర్దేసింది అని విమర్శలు చేస్తున్నారు. అయితే దీనికి జనసేన శ్రేణులు వారి సమాధానాన్ని కూడా ఇస్తున్నారు. చాలా చోట్ల జనసేన కార్యాలయాలు పూర్తిస్థాయి ఒకే అపార్టుమెంటులో లేవని ఒక అపార్టుమెంటులో వారు ఒక పోర్షన్ అద్దెకు తీస్కొని పార్టీ కార్యాలయాన్ని నడుపుతున్నామని ఇవేవి తెలీకుండా ఇతర పార్టీల వారు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలలోకి తీసుకెళ్తున్నారని  ఆరోపిస్తున్నారు.

మామాట: ఏదో ఒకటి చూపించాలి కదా బాస్

Leave a Reply