రాసిపెట్టుకోండి… జగనే సీఎం- రోజా

Share Icons:

తిరుమల, మే 22,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని, ఈ విషయంలో ఏ మాత్రం సందేహం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన రోజా, మీడియాతో మాట్లాడుతూ, జగన్ సీఎం అవనున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదని, మరో 24 గంటల్లో ఈ నిజం ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు.

లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలు దొంగ సర్వేలని, ఓ గదిలో కూర్చుని అంకెలేసుకుని వచ్చారని ఎద్దేవా చేసిన ఆమె, తమ సొంత సంస్థ హెరిటేజ్ ని అభివృద్ధి చేసుకునేందుకు అధికారాన్ని చంద్రబాబు అడ్డు పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. మహిళలను అప్పులపాలు చేయడమే కాకుండా, వారిని కోర్టు మెట్లు ఎక్కించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.

మామాట- మరో రోజు ఓపిక పడితే పోలా..

Leave a Reply