ఆయనవెళ్తే..ఈయనకు డిమాండ్

Share Icons:

నెల్లూరు,ఆగష్టు 27,

నెల్లూరు జిల్లా తెలుగుదేశంలో ప్రస్తుతం ఆదాల ప్రభాకరరెడ్డి హాట్‌ టాపిక్‌గా మారారు. కొన్ని నెలల క్రితం వరకు నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ కార్యకలాపాలకు మాత్రమే పరిమి తమైన ఆదాల ఒక్కసారిగా పార్లమెంట్‌ స్థానం పరిధిలో ని పలు నియోజకవర్గాలకు అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు. అయితే ఆదాల విషయంలో జరుగుతున్న ప్రచారం పార్టీకి మంచి చేస్తోందో, చెడు చేస్తోందో అర్థం కాక పార్టీ శ్రేణులు సతమవుతున్నారు.

ఆనం రామనారాయణరెడ్డి నిష్క్రమణ తరువాత టీడీపీలో ఆదాలకు డిమాండ్‌ పెరిగింది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈయన పేరు పార్టీలో మార్మోగిపోతోంది. గత ఎన్నికల్లో ఆదాల ప్రభాకరరెడ్డి నెల్లూరు పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే ఆ తరువాత పార్టీ నాయకులు తనకు విలువ ఇవ్వలేదనే మనస్తాపంతో పార్టీ వ్యవహారాల్లో అంటిముట్టనట్టు వ్యవహరించారు. నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా, అదే సమయంలో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నా రూరల్‌ నియోజకవర్గం వరకే పరిమితమయ్యారు. అయితే ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడాక ఈయనకు పార్టీలో విలువ పెరిగింది. ఇది జరగడానికి కొద్ది రోజుల ముందు వరకు ఆనం, ఆదాల అత్యంత సన్నిహితులుగా మెలిగారు. ఆత్మకూరు మినీ మహానాడు, రూరల్‌ నియోజకవర్గ మినీ మహానాడుల్లో ఆదాల మంత్రి సోమిరెడ్డిని టార్గెట్‌గా చేసుకొని మాట్లాడగా, ఆనం రామనారాయణరెడ్డి ఏకంగా ప్రభుత్వాన్నే టార్గెట్‌ చేశారు. ఆనం పార్టీ మారుతారనే ప్రచారం జరిగిన సందర్భంగా ఆదాల కూడా అదే దారిలో పయనిస్తారనే ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై జిల్లా మినీ మహా నాడులో ఆదాల స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు.

తను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆనం అనుభవాల నేపథ్యంలో ఆదాలను చేజార్చుకోకూడదనే ఉద్దేశంతో అధిష్ఠానం ఆదాలకు విలువ పెంచింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదాలను పిలిపించుకొని మాట్లాడారు. పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించమని కోరారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో పార్టీని సమన్వయం చేసుకోమని సూచించారు. ఆ తరువాత కూడా మూడు, నాలుగు సార్లు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో పాటు ఆదాల చంద్రబాబును కలిసి పార్టీ వ్యవహారాలపై చర్చించారు. ఇవన్నీ పార్టీలో ఆదాల పేరును విపరీతంగా ప్రచారంలోకి తెచ్చాయి. గత నాలుగున్నరేళ్లుగా పెద్దగా ప్రచారానికి నోచుకోని ఆదాలను ఒక్కసారిగా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే కీలక నాయకునిగా గుర్తించేలా చేశాయి.

వ్యక్తిగతంగా ఆదాల పేరు విస్తృత ప్రచారంలో ఉన్నా ఆయన ఎక్కడినుంచి పోటీ చేస్తారనే విషయంలో మాత్రం తీవ్ర గందరగోళం నెలకొంది. ఆర్థిక కారణాల దృష్ట్యా ఎంపీగా పోటీ చేయను, అసెంబ్లీకి పోటీ చేస్తానని ఆయన జిల్లా ముఖ్యుల సమక్షంలో సీఎంకు వివరించారు. ఈ క్రమంలో ఆదాల ఎంపీ స్థానానికి పోటీ చేయరనే విషయం జనంలోకి వెళ్లింది. దీంతో ఆయన ఇన్‌చార్జిగా ఉన్న నెల్లూరు రూరల్‌ నుంచి పోటీ చేస్తారని అంచనా వేసుకున్నారు. అయితే తాజాగా ఆయన అక్కడి నుంచి పోటీ చేయడం లేదనే ప్రచారం ఊందుకుంది.

ఆత్మకూరు నియోజకవర్గం సమన్వయానికి వెళ్లడంతో అక్కడి నుంచి పోటీ చేస్తారని.. ‘ఆశీర్వదిస్తే కోవూరు ప్రజల రుణం తీర్చుకుంటా’నని ప్రకటించడంతో అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారాలు జరిగాయి. వీటన్నిటినీ మించి తాజాగా కావలి నియోకవర్గం నుంచి కూడా ఆదాల పేరు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో తన బలంపై ఆదాల సర్వే చేయించుకొంటున్నారనే వార్త కావలిలో గుప్పు మనడంతో రకరకాల ఊహాగానాలు చోటు చేసు కొంటున్నాయి. ఇన్ని నియోజకవర్గాల నుంచి ఆదాల పేరు అభ్యర్థిగా ప్రచారం జరుగడం వెనుక ఆయా నియోజకవర్గాల్లో ప్రజలతో ఆయనకున్న సంబంధాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకున్న ప్రత్యేకతలే కారణంగా తెలు స్తోంది. అయితే.. ఈ ప్రచారాలు తెలుగుదేశం నాయకులు, శ్రేణుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.ఆదాల ఎంపీగా పో టీ చేస్తారో చేయరో తెలియని నేపథ్యంలో ఆ స్థానంలో టీడీపీ అ భ్యర్థి విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. రూరల్‌ నియోజకవ ర్గం విషయంలోనూ ఇదే పరిస్థితి. దీనికి తోడు తాజా వ్యవహా రశైలి, వ్యాఖ్యలు ఆత్మకూరు, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

ఆత్మకూరు ఇన్‌చార్జిగా ప్రకటించిన ఒకటి రెండు రోజుల్లోనే ఆ నియోజకవర్గ టీడీపీలో తీవ్ర దుమారం చెలరేగింది. పూర్వ ఇన్‌చార్జి కన్నబాబు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆమరణ దీక్షకు పూనుకున్నారు. దీనిని పరిష్కరించడానికి జిల్లా నేతలు నానా యాతన పడ్డారు. నియోజకవర్గ నాయకులైన కన్నబాబు, ధనంజయరెడ్డిలను పక్కన పెట్టి ఆదాల మండలస్థాయి నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారనే ఆగ్రహం అక్కడ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమయింది. శనివారం నాటి పరిణామాలు బొల్లినేని కృష్ణయ్య అభ్యర్థిత్వంపై సూచనలు వ్యక్తం చేసేవరకు అక్కడ అదే గందరగోళం కొనసాగుతోంది. మీరు ఆశీర్వదిస్తే రుణం తీర్చుకుంటా అని కోవూరు ప్రజలను ఉద్దేశించి ఆదాల అన్న మాటలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డిని తీవ్ర ఆవేదనకు గురిచేశాయి.

ఆదాల తన నియోజకవర్గంలో పార్టీని, క్యాడర్‌ను డిస్ట్రబ్‌ చేస్తున్నారని, కొంత మందిని ఉద్దేశపూర్వకంగా తనపైకి ఉసి గొల్పుతున్నారని, ఇక్కడి నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో తనపై పరోక్షంగా కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే పోలంరెడ్డి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన అధిష్టానం పోలం రెడ్డికి సర్దిచెప్పమని ఇన్‌చార్జి మంత్రి, పార్టీ అధ్యక్షుణ్ని ఆదేశించింది. దీంతో ఈనెల 14వ తేది రాత్రి మంత్రి అమరనాథరెడ్డి, బీద రవిచంద్ర పోలంరెడ్డిని కలిసి బుజ్జగించారు. మరో వైపు ఒక పత్రికకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఉదయగిరి ఎమ్మెల్యే పరిస్థితి ఏమి బాగోలేదని ఆదాల అన్నట్లు ప్రచురితమైన వార్తా కథనం పార్టీలో కల కలం సృష్టించింది. దీనిపై కూడా ఆ ఎమ్మెల్యే అధిష్ఠానా నికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

 

మామాట:  అంతే, ఏనిమిషానికి ఏమిజరుగునో….

Leave a Reply