నిమిషంలో రాజీనామా చేస్తాం….!

Share Icons:

వాళ్ళు తెంచుకోకముందే మనమే బయటకు వచ్చేద్దాం

అమరావతి, 20 ఫిబ్రవరి:

తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నిమిషంలో రాజీనామా చేస్తామంటూ బీజేపీ నేత, ఏపీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో టీడీపీతో పొత్తు వదులుకునే ఉద్దేశం తమకు లేదని, అయితే ఆ పార్టీ తెగదెంపులు చేసుకోక ముందే మనమే బయటకొద్దామని తమ నేతలతో ఇటీవలే చెప్పానని ఆయన అన్నారు.

అలాగే ఒకరు తమతో పొత్తు వదులుకుంటే, మరొకరు కలవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ఇక ఏపీలో తాము వెంట్రుక వంటి వాళ్లమని, కొండకు ఓ వెంట్రుకను కట్టి లాగుతున్నామని, వస్తే కొండ వస్తుందని, లేకపోతే వెంట్రుక పోతుందని వ్యాఖ్యానించారు.

అదే టీడీపీకి మాత్రం బోడిగుండు మిగులుతుందని అన్నారు.

ఇక కేబినెట్‌లో ఉన్న బీజేపీ నేతలు రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లపై ఆయన స్పందించారు. అధిష్టానం ఆదేశిస్తే నిమిషంలో రాజీనామా చేస్తామని, టీడీపీతో పొత్తు విడిపోతే బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదని ఆయన తెలిపారు.

మామాట: మంత్రివర్యా బయటకు  రావడానికి ముహూర్తం కావాలా ? 

English summary:

AP BJP leader and the minister Manikyala Rao made sensational comments to resign from the his ministry if the party high command orders.

Leave a Reply