జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి…

ap minister kodali nani interesting comments
Share Icons:

తిరుపతి:

 

ఏపీ మంత్రి కొడాలి నాని ఈరోజు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కావాలనీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావాలని తాను ఏడుకొండల స్వామికి మొక్కుకున్నానని తెలిపారు. ఇప్పుడు మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. జగన్ కు, ఏపీ ప్రజలకు వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు అన్నారు.

 

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణ, గోదావరితో పాటు ఇతర నదులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకుంటున్నారని తెలిపారు. జగన్ ను ఇబ్బంది పెట్టడానికి, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని మీడియా సంస్థలు, స్వయం ప్రకటిత మేధావులు, ఇతర ముసుగుల్లో కొందరు జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

 

వచ్చే నెల 1 నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తామని పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తామనీ, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని పేర్కొన్నారు.

 

అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో ఇంతవరకూ అంతుపట్టడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి మాటలు అనడానికి చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. పాడిఆవు లాంటి ప్రభుత్వ ఖజానాను చంద్రబాబు పిండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాకుండా తనను తాను చంద్రబాబు గోమాతగా అభివర్ణించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇంతకంటే పెద్ద జోక్ ఇంకొకటి ఉండదని వ్యాఖ్యానించారు.

 

‘అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరే కదా చంద్రబాబు గారూ? రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారు. ఇంకా మీపైన ఫిర్యాదు చేస్తారన్న భయమెందుకు? భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోందా?’ అని ప్రశ్నించారు.

Leave a Reply