సంక్రాంతికి బిచ్చగాని వేషం వేసిన చంద్రబాబు…ఓటుకు నోటు కేసు…

ap minister kodali nani sensational comments on chandrababu
Share Icons:

గుడివాడ: ఏపీ మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.సంక్రాంతికి బిచ్చగాని గెటప్ వేసిన చంద్రబాబు రాజధాని అమరావతి పేరుతో రాజకీయ పబ్బం గడుపు కోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ నాని మండిపడ్డారు. సంక్రాంతికి బిచ్చగాని వేషం వేసిన చంద్రబాబు వీధుల్లో జోలె పట్టి అడుక్కున్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ దెబ్బకు చంద్రబాబు అలా మారిపోయారని నానీ వ్యాఖ్యానించారు . చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు.

ఇక టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ తమ పార్టీకి 60 లక్షల సభ్యత్వం వుందని చెబుతున్నారని అయితే టీడీపీ సమావేశాలకు 500 మంది కూడా రావడం లేదని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు . చంద్రబాబు మాటలు వింటే రైతులకు న్యాయం జరగదు అని , రైతులకు న్యాయం జరగాలంటే ప్రభుతం దృష్టికి తమ సమస్యలను తీసుకురావాలని నానీ సూచించారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయి అమరావతికి వచ్చారని ఎద్దేవా చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో తాను చేసిన పాపాలకు అడుక్కునే పరిస్థితికి చంద్రబాబు చేరుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పగటి వేషగాడిలా మారిపోయారని ఎద్దేవా చేశారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన వసరం ఉందని చెప్పిన కొడాలి నానీ చంద్రబాబు ఏం చేసినా జగన్ నిర్ణయం మేరకే జరుగుతుందని తేల్చి చెప్పారు.

Leave a Reply