TRENDING NOW

ఏపీ టెన్త్, ఇంటర్, ఎంసెట్ పరీక్షలు, ఫలితాల విడుదల తేదీలు…

ఏపీ టెన్త్, ఇంటర్, ఎంసెట్ పరీక్షలు, ఫలితాల విడుదల తేదీలు…

అమరావతి, 12 ఫిబ్రవరి:

ఏపీలో నిర్వహించే ముఖ్యమైన పరీక్షలు..వాటి ఫలితాల తేదీలని మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఏపీ డీఎస్సీ పరీక్షా ఫలితాలను ఈ నెల 15వ తేదీన ప్రకటిస్తామని చెప్పారు. అలాగే పదోతరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేస్తామని చెప్పారు.

మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరుగతాయని.. ఏప్రిల్ 27న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఇక మొత్తం 6,21,623మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని..2,838 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

treefurn AD
Life Homepathy

అలాగే ఫిబ్రవరి 27నుంచి మార్చి 18వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని, ఇంటర్ పరీక్షలకు 10,17,600మంది విద్యార్థులు హాజరవుతున్నారని.. మొత్తం 1430 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని..ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల అవుతాయని చెప్పారు.

ఇక ఏప్రిల్ 19న ఏపీ ఈసెట్ పరీక్ష.. మే 30వ తేదీన ఫలితాలు, ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఏపీ ఎంసెట్ పరీక్షలు..మే1 ఫలితాలు, ఏప్రిల్ 26న ఐసెట్..మే 3వ తేదీన ఫలితాలు, మే1 నుంచి 4 వరకు ఏపీ పీజీసెట్ పరీక్షలు..మే 11న ఫలితలాలు ప్రకటిస్తామని చెప్పారు. 

మామాట: పరీక్షల కాలం వచ్చేసింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: