అందుకే ఎన్టీఆర్‌ని పక్కనబెట్టారు… లోకేశ్‌ది కార్పొరేట్ స్థాయి

ap minister kodali nani sensational comments on chandrababu
Share Icons:

అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నాని…టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లపై తీవ్ర విమర్శలు చేశారు.  జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయనే భావనతో 2009 ఎన్నికల్లో ఆయన చేత చంద్రబాబు ప్రచారం చేయించారని, కానీ తర్వాత తన కుమారుడు లోకేశ్ కు ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆ తర్వాత ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారని చెప్పారు. వాస్తవానికి లోకేశ్ ది కార్పొరేటర్ స్థాయి కూడా కాదని ఎద్దేవా చేశారు.

కుమారుడు అయినందువల్లే లోకేశ్ ని ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. టీడీపీకి లోకేశ్ గుదిబండగా మారారని అన్నారు. దివంగత ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, చంద్రబాబులా ఆయన ఏనాడూ సొల్లు కబుర్లు చెప్పలేదని తెలిపారు. నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇక టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఇసుక విషయంలో అవినీతి పాల్పడ్డారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్టు రుజువు చేసినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. అటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. భవన నిర్మాణ కార్మికులకు నిజంగానే ఉపాధి పోయిందో లేదో తెలియదు కానీ, బాబుకు ఆయన భాగస్వామికి చేతినిండా పని దొరికిందని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు.

రాంగ్ మార్చ్, ఒక్క పూట దీక్షల కోసం చేసిన ఖర్చుతో కనీసం 1000 కుటుంబాలు ఏడాదిపాటు జీవిస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, తన వ్యాఖ్యల్లో వల్లభనేని వంశీని కూడా ప్రస్తావించారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కీలకమైన స్థానాల్లో జనసేన డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపిందన్న విషయాన్ని వంశీ వెల్లడించాడని విజయసాయి పేర్కొన్నారు.

అందుకే గన్నవరంలో పవన్ సీపీఐ అభ్యర్థిని పోటీకి దింపింది చంద్రబాబు ఆదేశాల మేరకే అని కూడా వంశీ అంతఃపుర రహస్యాలు బయటపెట్టాడని వివరించారు. ఆఖరికి జనసేన అభ్యర్థుల బి-ఫారాలు సైతం టీడీపీ ద్వారానే వెళ్లినట్టు తెలిసిందని విజయసాయి ట్విట్టర్ లో స్పందించారు.

 

Leave a Reply